బాబుపై నాయిని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Update: 2018-10-26 10:21 GMT
రాజ‌కీయాల్లో ఉన్న వారుఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తారు. ఘాటైన ఆరోప‌ణ‌లు చేస్తారు. ఇవ‌న్నీ కామ‌న్‌. కానీ.. కీల‌క స్థానాల్లో ఉన్న వారు.. ఆ బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించిన వారి నోటి నుంచి వ‌చ్చే మాట‌ల్ని అంత తేలిగ్గా వ‌దిలేయ‌లేం. ఇంత‌కాలం ఓటుకు నోటు కేసుకు సంబంధించి పెద్ద‌గా మాట్లాడ‌ని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా వ్య‌వ‌హ‌రించిన నాయిని తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బాబు ఉలిక్కిప‌డేలా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హ‌స్తం ఉంద‌ని.. దానికి త‌గిన ఆధారాలు తెలంగాణ ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న‌ట్లుగా చెప్పారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచేందుకు వీలుగా చంద్ర‌బాబు కుట్ర ప‌న్నిన‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు.

హోం మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన నాయిని.. ఓటుకునోటు విష‌యం మీద ఎప్పుడూ మాట్లాడ‌ని ఆయ‌న‌.. తాజాగా బాబును ఇరుకున పెట్టేలా.. కేసీఆర్ మ‌నసు దోచుకునేలా వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ స‌ర్కారును ర‌ద్దు చేసి ముంద‌స్తుకు వెళ్ల‌టం.. అందులో భాగంగా ఇప్ప‌టికే త‌మ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. అయితే.. హోం మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న నాయిని (ఎమ్మెల్సీగా మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు) కి చెందిన నియోజ‌క‌వ‌ర్గమైన ముషీరాబాద్ కు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు.

ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న అల్లుడ్ని బ‌రిలోకి దించాల‌ని నాయిని తెగ ట్రై చేస్తున్నారు. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ నోటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. మ‌హా కూట‌మితో టీఆర్ఎస్ ను దెబ్బ తీసేందుకుబాబు ప్లాన్ చేస్తున్న వైనంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న కేసీఆర్ మ‌న‌సు దోచుకునేలా తాజా మాజీ హోంమంత్రిగా నాయిని చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌న‌మే కాదు.. అధినేత ద‌గ్గ‌ర మార్కులు భారీగా ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు. మ‌రి.. నాయిని వ్యాఖ్య‌ల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని.. ఆయ‌న కోరిన‌ట్లుగా ఆయ‌న అల్లుడికి పార్టీ టికెట్ ఇస్తారా? అన్న‌ది చూడాలి.



Tags:    

Similar News