ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీని ఊడ్చేసిందని.. తెలంగాణలో టీఆర్‌ఎస్ అన్ని పార్టీలనూ ఊడ్చేస్తోందని ప్రకటించాడు తెలంగాణ హోం శాఖమంత్రి, టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి. కాంగ్రెస్ నుంచి వచ్చిన కొంతమంది చేర్చుకొంటూ నాయిని ఈ వ్యాఖ్యానాలు చేశాడు. కాంగ్రెస్ పార్టీలోకి ఎంతో మంది వచ్చి చేరడానికి ఎంతో ఆసక్తితో ఉన్నారని.. అయితే వారిని తామే చేర్చుకోవడం లేదని నాయిని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ కథ అయిపోయిందని టీడీపీ గల్లంతయిపోయిందని, ఇప్పుడు మిగిలిన వారు తాము చేర్చుకోవడానికి తిరస్కరించడంతో అక్కడే ఆగిపోయిన వారని నాయిని అన్నాడు.
ఓవరాల్‌గా తెలంగాణ టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే మిగిలి ఉందని నాయిని చెప్పుకొచ్చాడు. మరిఅధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. తమ పార్టీ తప్ప ఎవరికీ ఏ దిక్కూలేదని అనడం మామూలే.
వెనుకటికి ఎంతోమంది రాజకీయ నేతలు తమ పార్టీల గురించి, తమ తమ నాయకత్వాల గురించి ఇలాగే విర్రవీగారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ వంతు వచ్చిందంతే!
అయితే నాయిని ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది భారతీయ జనతా పార్టీని ఊడ్చేసింది! అది జనాల సహకారంతో ఊడ్చేయడం. అయితే తెరాస అధికారంలోకి వచ్చాకా వివిధ పార్టీల నేతలను చేర్చుకొని ఆయా పార్టీలను ఊడ్చేశామని చెప్పుకొంటోంది. ఇదేమీ ప్రజలు కట్టబెట్టిన విజయం కాదు!
అధికారం యావతో వచ్చి నేతలు టీఆర్‌ఎస్‌లో వచ్చి చేరుతున్నారు తప్ప.. ప్రజలేమీ వారిని టీఆర్‌ఎస్‌లోకి చేరమని కోరడం లేదు. కాబట్టి టీఆర్‌ఎస్ వాళ్లు తమను తాము ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చుకవడం విడ్డూరమే అవుతుంది.