తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో గత కొన్ని రోజులుగా నయీం కు సంబందించిన విషయాలే హాట్ టాపిక్. నయీం ఎన్ కౌంటర్ జరిగి చాలా రోజులైంది.. ఆ ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత అంతకు మించిన హ్యూమన్ ఇంట్రస్టింగ్ విషయాలు ఎన్నో జరిగాయి.. అవన్నీ మీడియాలో క్రమక్రమంగా చల్లబడిపోయాయి కానీ.. నయీం విషయం మాత్రం రోజూ పథాక శీర్షికల్లో నిలుస్తుంది. ఆస్థాయిలో ఉన్నాయి మరి నయీం చేసిన అనులు.. ఆయనతో సంబందాలున్న పెద్దలు. తాజాగా నాయీంకు సంబందించిన కొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నయీంతో సంబందాలున్న నేతలు రెడ్ హ్యాండెడ్ గా దొరికినంతపనైంది అని అంటున్నారట దర్యాప్తు అధికారులు! ప్రతీ విషయాన్ని డైరీలో రాసే అలవాటున్న నయీం.. తన విషయాలను మరణానంతరం కూడా తెలిసేలా చేస్తున్నాయి. ఇదే క్రమంలో నయీం కి మరో అలవాటుంది.. అదే ఫోటోలు తీయడం.
ఇప్పటికే నయీంకు సంబందించిన - నయీంతో సంబందాలున్న వారికి సంబందించిన ఎన్నో విషయాలు పూసగుచ్చినట్లు చెబుతుంది అతని డైరీ. దీంతో పాటు ఇప్పుడు నయీం కున్న మరో అలవాటు "ఫోటో" లు కూడా చాలా విషయాలనే చెబుతున్నాయి. తాజాగా నయీంతో నల్గొండకు చెందిన ఎమ్మెల్యేల బేటీలకు చెందిన ఫోటోలు వెలుగులోకి రావడంతో ఈ విషయం తెలిసింది. నల్లగొండ ఎమ్మెల్యేలనే కాదు.. తనను ఎవరు కలిసినా, నయీం ఎవరిని కలిసినా కచ్చితంగా వారికి సంబందించిన, వారితో ఉన్న ఒక ఫోటో ఉంటుందని దర్యాప్తు వర్గాలంటున్నాయి. నయీమ్ కు అంగరక్షకులుగా ఉండే యువతుల్లో ఒక అమ్మాయి వద్ద ఒక రహస్య కెమెరా ఉంటుందని, ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఆమె క్లిక్ మనిపిస్తుందని పోలీసులంటున్నారు. ఈ ఏర్పాటుతోపాటు తనను వ్యక్తిగతంగా కలిసే సీక్రెట్ రూంలో కూడా ఎవరికీ కనిపించకుండా సీసీ కెమెరాలు కూడా నయీం అమర్చుకున్నాడని పోలీసులంటున్నారు.
ఈ ఈ అలవాట్ల విషయంలో నయీం కు ఏమాత్రం అలసత్వం లేదని, ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు పక్కాగా ప్లాన్ చేసేవాడని చెబుతుంది తాజా విషయం. ఎన్ కౌంటర్ కావడానికి 10 నిమిషాల ముందు కూడా ఒక పోలీస్ అధికారితో ఫోన్ లో మాట్లాడాడని, ఒక డీల్ కు సంబంధించి ఎంత ఒత్తిడి తెచ్చినా ఆ డీఎస్పీ స్థాయి అధికారి అంగీకరించలేదని నయీం తన తన డైరీలో రాసుకున్నాడని చెబుతున్నారు అధికారులు! నయీం ఏ ఉద్దేశ్యంతో వీటిని సేకరించడం, రాయడం చేసేవాడో కానీ.. ప్రస్తుతం ప్రపంచానికి ఆ చీకటి మనిషితో సంబందాలున్న వారి వివరాలు పూసగుచ్చినట్లు చెబుతున్నావి ఇవే.