తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం వద్ద పర్యాటక బోటు మునిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 61మందితో వెళ్లిన బోటులో లైఫ్ జాకెట్లతో ఉన్న వారిని స్థానికులు గ్రామస్థులు రక్షించారు. ఇక అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు.
ప్రమాదం విషయం తెలియగానే రాజమండ్రి నుంచి జాతీయ ఎన్టీఆర్ ఎఫ్ బృందాన్ని ప్రత్యేక హెలీక్యాప్టర్ లో ఘటన స్థలికి పంపారు. సుమారు 30 మందితో కూడిన ఎన్టీఆర్ ఎఫ్ బృందం ఘటన స్థలి వద్ద హెలీక్యాప్టర్ బోట్లతో పర్యాటకులను రక్షిస్తోంది. మృతిచెందిన వారి డెడ్ బాడీలను వెలికితీస్తోంది.
తాజాగా సాయంత్రం 4 గంటల వరకు బోటు మునిగిన ప్రమాదంలో గోదావరిలో తేలిన ఐదు మృతదేహాలను ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఆచూకీ గల్లంతైన వారి కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
లైఫ్ జాకెట్లు వేసుకున్న 17 మందిని తూటుగుంట గ్రామస్థులు రక్షించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఐదు మృతదేహాలు ఇప్పటివరకు వెలికితీశారు. జాకెట్లు వేసుకోని వారు గోదావరిలో కొట్టుకుపోయే అవకాశం ఉందని.. సమీప గ్రామాల ప్రజలు ఒడ్డున పర్యవేక్షించాలని అధికారులు కోరుతున్నారు. గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ఉండడంతో మృతదేహాలు కొట్టుకుపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు.