టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ ఫైనల్లో ఈటెని 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. అథ్లెటిక్స్ లో భారత్ 100 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే..
ఈ ఫైనల్లో తాను ఫస్ట్ త్రో విసిరేందుకు తన జావెలిన్ వెతకగా.. అది పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ చేతుల్లో కనిపించిందని ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా వెల్లడించారు. నీరజ్ చోప్రా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది.
పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్.. జావెలిన్ ను టాంపరింగ్ చేయడానికే ఫైనల్ కు ముందు చోప్రా జావెలిన్ ను తీసుకున్నాడని నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
అయితే తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో నీరజ్ చోప్రా హుందాగా స్పందించాడు. ‘క్రీడలు మాకు ఒక్కటిగా ఉండాలని నేర్పాయి. ఫైనల్ కు ముందు నా జావెలిన్ తో అర్హద్ నదీమ్ ప్రాక్టీస్ చేశాడు. ఇందులో తప్పేమీ లేదు. రూల్స్ కు వ్యతిరేకం కూడా కాదు. కానీ కొంత మది నేను చేసిన ఈ వ్యాఖ్యలకు తప్పుడు అర్థాలను జోడించి వివాదాస్పదంగా మారుస్తున్నారు. దయచేసి మీ స్వార్థపూరిత ప్రచారం కోసం నా వ్యాఖ్యలను వక్రీకరించవద్దు . అర్షద్ నా జావెలిన్ ను ట్యాంపరింగ్ చేయలేదు.
ప్లీజ్ దురుద్దేశంతో వివాదంలోకి నా పేరును లాగొద్దు’ అని నీరజ్ చోప్రా అభ్యర్థించాడు.
టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో ఏకంగా 87.58 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. అతడి తర్వాత చెక్ రిపబ్లిక్ త్రోయర్లు రజతం, కాంస్యం గెలిచారు.