కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అన్నంతనే కళ్ల వెంట చుక్కలు కనిపించే బిల్లు గుర్తుకు రాక మానదు. డబ్బులు పోయినా మంచి వైద్యం అయితే దక్కుతుందన్న ఆశ ఉంటుంది. అయితే.. ఇలాంటి ఆశ మీద కూడా అనుమానాలు వచ్చే పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది. ఒక పేషెంట్ విషయంలో సదరు ఆసుపత్రి వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఇంత నిర్లక్ష్యమా? అంటూ ఆశ్చర్యపోయే పరిస్థితి.
రాజమండ్రికి చెందిన మహలక్ష్మి అనే పెద్దావిడ హైదరాబాద్ ఎల్ బీ నగర్ లోని కామినేని ఆసుపత్రికి వెళ్లారు. మెడికల్ చెకప్ లు చేయించుకున్నారు. ఇందుకు మామూలుగానే బిల్లు వేశారు. ఆమె కూడా వాటిని కట్టేశారు. వైద్య పరీక్షలు అయ్యాయి. తనకున్న అనారోగ్యం విషయమైన మెడికల్ రిపోర్టులు ఏం చెబుతున్నాయన్న ఆసక్తితో వాటిని చూడటం మొదలెట్టారు.
అలా రిపోర్టులు చూస్తున్న ఆమెకు షాకింగ్ అంశం ఒకటి కనిపించింది. ఆమె యూట్రస్ నార్మల్ గా ఉందని.. ఎలాంటి సమస్యా లేదంటూ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసినంతనే ఆమె షాక్ తిన్నారు. ఎందుకంటే ఆమె యూట్రస్ ను తొలగించి దాదాపు 20 ఏళ్లు అవుతుంది. లేని యూట్రస్ ఉందని చెప్పటమే కాదు.. దాని పని తీరు నార్మల్ గా ఉందంటూ పేర్కొన్న వైనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారీ దవాఖానాల్లో ఇలాంటి నిర్లక్ష్యం అంటే అదో పద్దతి. వేలకు వేలు డబ్బులు పోసిన కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే వారికి ఈ తరహా వైద్యసేవల్ని అందించటంపై విస్మయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.