నేపాల్‌ ను కరోనా ఫ్రీగా ప్రకటించిన మంత్రికి పాజిటివ్ !

Update: 2020-10-12 08:15 GMT
ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయంతో వణికిపోయేలా చేస్తున్న కరోనా నేపాల్‌ లో అడుగు పెట్టదని ఆ మంత్రి గతంలో భీరాలు పలికారు. ఆ ప్రకటన చేసిన కొన్ని రోజులకే నేపాల్ ‌లో  కరోనా పాజిటివ్ కేసులు లక్షకి పైగా నమోదు అయ్యాయి. అయితే నేపాల్ కరోనా ఫ్రీ అంటూ ప్రకటించిన మంత్రి కూడా వైరస్ బారినపడ్డారు. నేపాల్‌ మంత్రివర్గంలో కరోనా బారినపడిన తొలి మంత్రి ఆయనే కావడం గమనార్హం. అంతేకాదు, నేపాల్ కేపీ శర్మ ఓలికి అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో ఆయనొకరు. కరోనా పాజిటివ్ ‌గా నిర్ధారణ కావడానికి కొన్ని గంటల ముందే  భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రాతో ఆయన భేటీ అయ్యారు. అది కూడా కనీసం పేస్ మాస్కు లేకుండా. దీనితో అయన పై విమర్శల వర్షం కురుస్తుంది.

నేపాల్‌ పర్యాటక శాఖ మంత్రి యోగేశ్‌ భట్టారాయ్‌ తాను కరోనా వైరస్‌ బారినపడినట్లు సోషల్ మీడియా వేదికగా ఆదివారం స్వయంగా ప్రకటించారు. ఎనిమిది నెలల కిందట నేపాల్ ‌ను ఆయన కరోనా వైరస్‌ లేని దేశంగా అభివర్ణించారు. కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అస్వస్థతకు గురైతే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ సన్నిహితుల్లో ఇప్పటికే 8 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. వీరిలో ప్రధాని వ్యక్తిగత వైద్యుడు, ఫొటోగ్రాఫర్‌, మీడియా ఎక్స్ ‌పర్ట్ ‌తో పాటు మరికొందరు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడానికి ముందు రోజే యోగేశ్‌ భట్టారాయ్.. భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రాతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పెంచడం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆ తరువాత అయనకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో భారత రాయబారి వినయ్‌ మోహన్ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.
Tags:    

Similar News