జ‌గ‌న‌న్నా.. మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే దిక్కులేదు.. ఇప్పుడు ఏం చెబుతావ్‌!!

Update: 2021-12-11 04:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు. ``జ‌గ‌న‌న్నా.. మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే దిక్కు లేదు.. ఇప్పుడు ఏం చెబుతావ్‌!!`` అని వారు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. కేవ‌లం ఒక్క ఫోన్ కాల్‌తోనే.. అంబులెన్సులు.. ప‌రుగులు పెట్టుకుంటూ వ‌స్తాయ‌ని.. ప‌దే ప‌దే చెప్పిన .. సీఎం జ‌గ‌న్‌.. ఈ విష‌యంలో దేశంలో ఎక్క‌డా లేని రికార్డులు సొంతం చేసుకున్నామ‌ని.. వ్యాఖ్యానించారు.

అయితే.. ఇప్ప‌టికీ.. చాలా మందికి 104, 108 సేవ‌లు స‌మ‌యానికి అందుబాటులో లేవ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో అనేక ఫిర్యాదులు కూడా వ‌చ్చాయి.

అయిన‌ప్ప‌టికీ.. ఇవ‌న్నీ గిట్ట‌నివారు.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు చేస్తున్న వాద‌న‌గా ప్ర‌భుత్వం కొట్టిపారేసింది. అంతేకాదు.. ఇలాంటి వారిపై నిఘా పెట్టాల‌ని కూడా ప్ర‌భుత్వం అంత‌ర్గ‌త ఆదేశాలు ఇచ్చిన విష‌యం కూడా తెలిసిందే. అయితే.. ఇప్పుడు తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో వైసీపీ ఎమ్మెల్యేనే నివ్వెర పోయారు.

అనంతపురం రూరల్ కురుగుంట గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని సిమెంటు లోడుతో వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు గాయపడ్డాడు.

ఆ సమయంలో.. అనంతపురం నుంచి అదే రోడ్డు మార్గంలో రాయదుర్గం వెళ్తున్న వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి గాయపడిన యువకుడిని చూశారు. వెంటనే 108 వాహనానికి మూడు సార్లు తానే ఫోన్ చేశారు. అయిన‌ప్ప‌టికీ.. అంబులెన్స్ రాలేదు.

ఇదే విష‌యాన్ని స‌మీప ఆసుప‌త్రికి కూడా చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. అంబులెన్స్ రాలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఎమ్మెల్యే కాపు ఒక ప్రజా ప్రతినిధి గాయపడిన వ్యక్తి కోసం అంబులెన్స్కు ఫోన్ చేస్తే రాకపోవడం ఏంటని ఆంబులెన్స్ సిబ్బందిపై ఫోన్లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయినా.. ఎవ‌రూ రియాక్ట్ కాలేదు. చివ‌ర‌కు ఆయ‌నే స్వ‌యంగా గాయ‌ప‌డిన యువ‌కుడిని.. చివరికి ప్రైవేటు వాహనంలో అక్కడి నుంచి చికిత్స నిమిత్తం తరలించారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. `దీనికే మంటావు.. జ‌గ‌న‌న్నా!`` అంటూ.. నెటిజ‌న్లు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.
Tags:    

Similar News