చేర్చుకుంది.. కాంగ్రెస్ నేత‌ల‌ను.. కామెంట్లేమో.. టీఆర్ఎస్‌ పైనా..

Update: 2021-12-12 05:30 GMT
బీజేపీ తెలంగాణ సార‌థి బండి సంజ‌య్ ఆస‌క్తిగా స్పందించారు. ఈ రోజు ఆయ‌న ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్‌కు చెందిన ఓ వందమంది చోటా నాయ‌కులు కాషాయ కండువా క‌ప్పుకొన్నారు. ఈ క్ర‌మంలో బండిలో కొత్త ఉత్తేజం మొద‌లైంది. అయితే.. ఆయ‌న కాంగ్రెస్‌ను టార్గ‌టె్ చేయ‌కుండా(ఏముంది చేయ‌డానికి అంటారా? మ‌రి కేంద్ర నేత‌లు చేస్తున్నారుక‌దా!) టీఆర్ ఎస్‌పై విరుచుకుప‌డ్డారు. దీంతో నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. చేర్చుకుంది.. కాంగ్రెస్ నేత‌ల‌ను.. కామెంట్లేమో.. టీఆర్ ఎస్‌పైనా.. ఏంది బండ‌న్నా? ఇది.. అని వ్యాఖ్యానిస్తున్నారు.

కలెక్టర్లకు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవుల ఆశ చూపుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. వరి కుప్పలపై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. పట్టించుకునే స్థితిలో ముఖ్యమంత్రి లేరని ఆరోపించారు. వానాకాలం పంటను ఎందుకు కొనరని రైతులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రజాసమస్యలపై దృష్టి మళ్లించేందుకు సీఎం కేసీఆర్‌ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్‌గల్‌ మండలానికి చెందిన సుమారు 100 మంది చోటా కాంగ్రెస్‌ నాయకులకు సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వారికి కండువాలు క‌ప్పారు. అనంత‌రం సంజ‌య్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో మంత్రులంతా నామమాత్రంగా మారారని ఆరోపించారు. టీఆర్ ఎస్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఆగదని బండి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని కేంద్రంతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని సంజయ్ అన్నారు. సంతకాలు పెట్టే ముందు ఆలోచించి పెట్టాలని హితవు పలికారు.

కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్రంలో భూసార పరీక్షలు చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతారని టీఆర్ ఎస్ ప్రచారం చేస్తోందన్న సంజయ్.. చైనా సహకారంతో కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతారేమోనని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకునే పరిస్థితి లేదు. వరి కుప్పలపై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వానాకాలం పంట ఎందుకు కొనరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం కొత్త సమస్యలు సృష్టిస్తారు. కేసీఆర్ పాలనలో మంత్రులంతా నామమాత్రమే. అని బండి సంజయ్ మ‌రోసారి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News