తెలంగాణ బీజేపీలో తీవ్ర వివాదానికి దారితీసిన.. అమిత్ షా చెప్పులు మోసిన ఎపిసోడపై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తిగా రియాక్ట్ అయ్యారు. అమిత్ షా తనకు గురువు, తండ్రి లాంటి వారని... అలాంటి వ్యక్తికి చెప్పులు తీసి ఇస్తే తప్పేంటని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా... జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో పర్యటించారు. మునుగోడులో పొరపాటున టీఆర్ ఎస్ గెలిస్తే వ్యవసాయ మోటార్లకు కేసీఆర్ మీటర్లు పెట్టడం ఖాయమన్నారు.
బీజేపీ మీటర్లు పెడుతున్నారంటూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. అమిత్ షా చెప్పులు పట్టు కుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచారంటూ... వచ్చిన విమర్శలను సంజయ్ తిప్పికొట్టారు.
కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటనకు ముందు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించు కున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా బయటకు వస్తుండగా ఆయన వెంటే ఉన్న బండి సంజయ్.. షా కంటే ముందు ఉరికి ఉరికి వెళ్లి ఆయన చెప్పులు తీసి ఇచ్చినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై టీఆర్ ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా..? అంటూ పోస్టు చేయగా.. ఇతర శ్రేణులు ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈ వీడియో చూసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా దీన్ని రీట్వీట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సైతం స్పందించారు. బండి సంజయ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని అన్నారు.
నెటిజన్లు ఏమన్నారంటే..
తాజాగా బండి ఇచ్చిన క్లారిటీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ''అయ్యా బండిగారూ..మీ గురువు.. అంటే.. మీ ఇంటికి పిలుచుకుని.. నాలుగు గోడల మధ్య మీరు ఆయనకు చెప్పులు అందిస్తారో.. పాదాలు పడతారో.. కాళ్లు కడుగుతారో.. చేసుకోండి.
కానీ.. మీరు తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సారథిగా ఉంటూ.. వ్యక్తిగత పనులకు ప్రాధాన్యం ఇస్తామంటే.. ఎలా?'' అని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు.. 'నీ పర్సనల్ నీ ఇంటికాన చూసుకో!' అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరు.. రేపు.. ఇంకా ఏదైనా చేసి.. ఇది కూడా గురువు కోసమే చేశానంటావా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా.. తాజాగా బండి చుట్టూ.. ముసురుకున్న వివాదం బీజేపీకి ముప్పేట దాడిగా మారింది.