తెలంగాణ‌ బీజేపీ ఎంపీలు ద‌మ్ముంటే.. వైట్ పేప‌ర్ రిలీజ్ చేయొచ్చు క‌దా!

Update: 2022-03-20 07:30 GMT
తెలంగాన బీజేపీ ఎంపీలు.. నోరు విప్పితే.. మేం అంది తెచ్చాం.. ఇది తెచ్చాం.. అంటూ కామెంట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. కొంద‌రు మ‌రింత దూకుడుగా.. కేంద్రం ఇచ్చిన నిధుల‌తోనే రాష్ట్రంలోని కేసీఆర్ ప్ర‌భుత్వం మ‌నుగ‌డ సాధిస్తోంద‌ని వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మ‌రి ఇంత‌గా మాట‌లు చెబుతున్న నాయ‌కులకు తాము తెచ్చిందేంటో.. తెలంగాణ‌కు కేంద్రం ఇచ్చిందేం టో.. వైట్ పేప‌ర్ విడుద‌ల చేసే ద‌మ్ముందా? అనేది మేధావుల మాట‌. ఇదే విష‌యం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో హ‌ల్చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే..

2018లో జ‌రిగిన తెలంగాణ ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ చావు త‌ప్పిన‌ట్టుగా కేవ‌లం ఒకే ఒక్క ఎమ్మెల్యేతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఘోసా మ‌హ‌ల్ నుంచి ఒక్క రాజాసింగ్ త‌ప్ప‌.. మిగిలిన వారు డిపాజిట్లు ద‌క్కితే చాల‌నుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, 2019లో వ‌చ్చిన‌  సార్వ‌త్రిక ఎన్నిక ల‌స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ వేవ్ క‌లిసి వ‌చ్చి నాలుగు చోట్ల నుంచి న‌లుగురు ఎంపీలు విజ‌యం ద‌క్కించుకున్నారు. క‌రీం న‌గ‌ర్ నుంచి బండి సంజ‌య్‌(ప్ర‌స్తుతం రాష్ట్ర చీఫ్‌), నిజామాబాద్ నుంచి ధ‌ర్మ‌పురి అర్వింద్‌(ఈయ‌న కేసీఆర్ త‌న‌య‌.. క‌విత‌ను ఓడించారు. ఇక‌, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రోవైపు.. సికింద్రాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి కిష‌న్ రెడ్డి విజ‌యం ద‌క్కించుకుని.. కేంద్ర మంత్రి ప‌ద‌విని సైతం ద‌క్కించుకున్నారు.

అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఎంపీలు.. తీవ్ర‌విమ‌ర్శుల చేస్తున్నారు. కేంద్రం ఇస్తున్న నిదుల‌తోనే రాష్ట్రం న‌డుస్తోంద‌ని.. చెబుతున్నారు. కేంద్రం ఉదారంగా రాష్ట్రానికి ఎన్నో ఇస్తోంద‌ని కూడా చెబుతున్నారు. అయితే.. ఈ క్ర‌మంలోనే ఏం తెచ్చారో చెప్పండ‌ని.. టీఆర్ ఎస్ నుంచి ఛాలెంజ్‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో నే బండి సంజ‌య్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైవేకు నిధులు ఇచ్చామ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి హైవేలో టోల్ గేట్ డ‌బ్బులు వ‌సూలు చేస్త‌సున్నారు. ప్ర‌జ‌లు క‌ట్టే డ‌బ్బుల‌తోనే హైవేల‌ను వేస్తున్నారు. ఈ విష‌యం మీకు ఆమాత్రం తెలియ‌దా? అనేది బండిపై టీఆర్ ఎస్ నేత‌లు చేస్తున్న కామెంట్లు.

అదేస‌మ‌యంలో హైద‌రాబాద్‌కు ఒక్కటంటే ఒక్క నేష‌న‌ల్ కంపెనీని తెచ్చారా? అని ప్ర‌జ‌లు అడుగుతున్నారు. ఒక‌వైపు అధికార పార్టీ టీఆర్ ఎస్ నేత‌లు.. మీరు ఏం తెచ్చారు.? అని ప్ర‌శ్నిస్తుంటే.. వారిపై బీజేపీ ఎంపీలు విరుచుకుప‌డుతున్నారు. మ‌రి ప్ర‌జ‌లు అడుగుతున్నారు.. క‌దా.. వారికైనా స‌మాధానం చెప్పరా? అనేది ప్ర‌శ్న‌. వారిని కూడా తిడ‌తారా? అనేది ప్ర‌శ్న‌. అయితే.. ఇక్క‌డ కూడా బీజేపీ నాయ‌కులు చాలా తెలివిగా త‌ప్పించుకుంటున్నారు. కేంద్రం సంస్థ‌లు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉంద‌ని.. కానీ, రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం.. స్థ‌లాలు చూపించ‌డం లేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో నిజంగానే కేంద్రం అనేక సంస్థ‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్ ప్ర‌భుత్వం వాటిని తీసుకునేందుకు స్థలాలు చూపించేందుకు రెడీగా లేద‌నే విష‌యాన్ని.. వైట్ పేప‌ర్ రూపంలో ఇస్తే.. టీఆర్ ఎస్ సంగ‌తిని ప్ర‌జ‌లే చూసుకుంటారుగా ! అనేది ప్ర‌శ్న‌.

రాష్ట్రంలో న‌లుగురు ఎంపీలు క‌లిసి.. ఏం తెచ్చారో.. తెలంగాణ‌కు ఏం చేశారో చెప్పాలి క‌దా! పోనీ.. స్టేట్ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టినా.. మీరు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఏం చేశారో.. అయినా.. చెప్పగ‌లుగుతారా?  ఏం తెచ్చారో అయినా.. చెబుతారా? అనేది సామాన్యుల ప్ర‌శ్న‌. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంటారా?  జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌.. కేంద్రమే వాటిని అన్ని రాష్ట్రాల‌కు కేటాయిస్తుంది. ఇది కాకుండా.. మీరేం చేశారో.. ఏం తెచ్చారో.. చెపే ద‌మ్ము.. దీనికి సంబంధించి వైట్ పేప‌ర్ విడుద‌ల చేసే ద‌మ్ము ఉందా? అని అడుగుతున్నారు ప్ర‌జ‌లు. మ‌రి ఏం చెబుతారో చూడాలి.
Tags:    

Similar News