కరోనాకు తరతమ బేధాలు ఉండవు. గీత దాటిన వారు ఎవరైనా సరే.. తన కోరలతో గాయపరుస్తుంది. దానికి సామాన్యుడు.. సెలబ్రిటీ అన్న తేడా లేదు. గీత దాటారా? లేదా? అన్నది మాత్రమే ప్రామాణికం. సామాన్యులకు తరచూ ఉపదేశాలు ఇస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే కేసీఆర్ కుటుంబసభ్యులు.. తమకేం కాదన్న ధీమాను ప్రదర్శించి ఈ రోజున కరోనా బారిన పడ్డారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారం కోసం తపించిన కేసీఆర్.. ఆ సభకు హాజరైన నేపథ్యంలో కరోనా పాజిటివ్ గా తేలింది. సాగర్ సభకు ముందు నిర్వహించిన ఒక సమావేశాన్ని ఒక సమావేశ మందిరంలో ఏర్పాటు చేయటం.. అక్కడ మాస్కు పెట్టుకోకుండా 40 నిమిషాల పాటు మాట్లాడటం.. ఆ సందర్భంలోనే ఆయన కరోనాకు చిక్కి ఉంటారని అంచనా వ్యక్తమవుతుంటుంది.
సభ నుంచి నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లటం.. అక్కడ పాజిటివ్ కావటం.. హోం ఐసోలేషన్ లో ఉంటూ ఆయన చికిత్స పొందటం తెలిసిందే. ఈ సందర్భంగా ఫామ్ హౌస్ లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్న ఆయన.. తన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు సూచనతో యశోదకు వచ్చి సిటీస్కాన్ చెస్టు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించిన కారులోనే ఆయన బంధువు.. రాజ్యసభ సభ్యుడు సంతోశ్ ఉన్నారు. నిత్యం ఆయన వెంటే ఉన్న సంతోష్.. ఫామ్ హౌస్ లో జాగ్రత్తలు తీసుకున్నా.. యశోదాకు తీసుకొచ్చే సమయంలో జరిగిన నిర్లక్ష్యమే ఆయనకు పాజిటివ్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరీక్షల కోసం యశోదాకు వచ్చిన సీఎం కేసీఆర్ ను ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కలవటం తెలిసిందే. ముఖ్యమంత్రి అన్నది పక్కన పెడదాం.. తన తండ్రికి పాజిటివ్ అయ్యాక ఫామ్ హౌస్ కు వద్దని గట్టిగా చెప్పటంతో ఆయన వెళ్లలేకపోయారని చెబుతారు. తీరా.. నగరానికి వచ్చిన తర్వాత చూసేందుకు కేసీఆర్ పడిన ఆరాటమే ఇప్పుడీ రోజున ఆయన పాజిటివ్ కావటానికి కారణమైందన్న మాట వినిపిస్తోంది. యశోదాకు రావటానికి ముందే మంత్రి కేటీఆర్ ఆసుపత్రిలో వెయిట్ చేయటం.. తండ్రికి పరీక్షలు జరిగే సమయంలో దగ్గరగా ఉన్నట్లు చెబుతారు. సామాన్యులు తరచూ చేసే తప్పులే చేసిన కేసీఆర్ కుటుంబ సభ్యులు.. ఈ రోజు కరోనా బారిన పడ్డారని చెప్పాలి. నిజానికి.. వీరి ఉదంతం తెలంగాణ ప్రజలకు ఒక కనువిప్పగా ఉండాలి. కుటుంబ సభ్యులే కావొచ్చు.. అత్యంత సన్నిహితులే కావొచ్చు.. కరోనా బారిన తమ వారు పడినప్పుడు.. వారికి వీలైంత దూరంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మనసులోని ప్రేమను.. అభిమానాన్ని ప్రదర్శించాలన్న బలహీనత కరోనా కాటుకు గురి చేస్తోంది. దీని వల్ల జరిగే నష్టమేమిటంటే.. కరోనా వ్యాప్తిని పరోక్షంగా సహకరించినట్లే అవుతుందన్నది మర్చిపోకూడదు. కరోనా విషయంలో భావోద్వేగాలకు గురైన కల్వకుంట్ల కుటుంబం దాని బారిన పడిన వైనాన్ని ఒక పాఠంగా తీసుకోవాలని చెప్పక తప్పదు.