కొత్త మంత్రివర్గం... డేట్ ఫిక్స్...?

Update: 2022-03-15 11:30 GMT
ఏపీలో కొత్త మంత్రివర్గం విస్తరణ తేదీ ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక డేట్ అయితే కచ్చితం అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఏపీ బడ్జెట్ సమావెశాలు ఈ నెల మూడవ వారంతో ముగుస్తాయి. అవి అలా ముగియడంతోనే ప్రస్తుతం ఉన్న మంత్రులు అంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తారని భోగట్టా.

ఆ మీదట జగన్ పూర్తి స్థాయిలో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు వీలుగా తనదైన శైలిలో కసరత్తు మొదలుపెడతారు అని అంటున్నారు. ఇలా మంత్రుల సామూహిక రాజీనామాలకు కూడా ఈ నెల 27వ తేదీన డేట్ ఫిక్స్ చేశారని అంటున్నారు.

ఈ మేరకు మంత్రులకు మౌఖికంగా ఆదేశాలు జారీ అయినట్లుగా అపుడే ప్రచారం మొదలైంది. గట్టిగా చెప్పాలీ అంటే ఇప్పటికి 12 రోజులు మాత్రమే ప్రస్తుత  మంత్రులు అధికారంలో ఉండేది అన్న మాట. ఆ తరువాత వారు మాజీలు అవుతారు.

ఇక జగన్ కొత్త మంత్రివర్గ విస్తరణ ఏప్రిల్ 2వ తేదీ ఉగాది వేళ చేస్తారని అంటున్నారు. అంటే టోటల్ గా పాతిక మంది మంత్రులను ఆయన తీసుకుని వారి చేత గవర్నర్ తో ప్రమాణం చేయిస్తారు. అలా కొత్త మంత్రులతో ప్రస్తుత క్యాబినెట్ లో పనిచేసిన ముగ్గురు నలుగురు మంత్రులు  కూడా ఉండవచ్చు అని అంటున్నారు. అయితే వారు ఎవరో మాత్రం ఇప్పటికైతే తెలియదు.

వారూ వీరూ అన్న తేడా లేకుండా మొత్తం అందరి రాజీనామాలు తీసుకుని ఫ్రెష్ గా మంత్రి వర్గం ఏర్పాటు చేయాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి మంత్రి వర్గ విస్తరణకు డేట్ ఏప్రిల్ 2 అని కన్ ఫర్మ్ అయిపోయింది.

ఇక  ఈ తాజా  పరిణామం   వైసీపీ రాజకీయ వర్గాలలో హాట్ హాట్  చర్చకు దారి తీస్తోంది. అదే టైమ్ లో మొత్తానికి మొత్తం మంత్రుల రాజీనామాతో అంతా ఒకే సారి మాజీలు అవుతారు అన్న వార్త కూడా కలకలం రేపుతోంది.
Tags:    

Similar News