వైఎస్సార్ సీపీలో 'నానీ' ల ప‌రిస్థితి ఏంటి?

Update: 2022-02-26 06:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో `నానీ`లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మంత్రుల్లోనే ముగ్గురు నానీలు ఉన్నారు. కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని.. పేర్లు అంద‌రికీ తెలిసిందే. వీరిలోనూ కొడాలి నాని, పేర్ని నానిల పేర్లు త‌ర‌చుగా మీడియాలోనూ వ‌స్తుంటాయి. ఎందుకంటే.. వివాదాలు ఎక్క‌డ ఉంటాయో.. వీరు అక్క‌డే ఉంటారు!  కాబ‌ట్టి!! ఈ నేప‌థ్యంలొ ఇప్పుడు వీరి ప‌రిస్థితి ఏంటి?  జ‌గ‌న్ ఏం చేయ‌నున్నారు? అనే చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఎందుకంటే.. 2019లో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. త‌న కేబినెట్‌ను రెండున్న‌రేళ్ల త‌ర్వాత సంపూర్ణంగా 90 శాతం వ‌ర‌కు మారుస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రెండున్న‌రేళ్లు పూర్త‌య్యాయి. అయి తే.. క‌రోనా కార‌ణంగా.. మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ వాయిదా పడింద‌ని అనుకున్నా.. ఇప్పుడు ఉగాది నాటికి మంత్రి మండ‌లి పునర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌డ‌తార‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను కూడా ఒక కొలిక్కి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అంటే.. జిల్లాల ఏర్పాటు పూర్తి కాగానే.. మంత్రి వ‌ర్గంపై సీఎం జ‌గ‌న్ దృష్టి పెడ‌తార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఒక్కొక్క జిల్లా నుంచి అంటే.. ఇప్పుడున్న 13 జిల్లాలు.. త్వ‌ర‌లోనే 26 కానున్న నేప‌థ్యంలో ఆయా జిల్లాల నుంచి 26 మందిని మంత్రులుగా జ‌గ‌న్ తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది.. పైన చెప్పుకొన్న‌ట్టుగా ఇద్ద‌రు నానీల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ఎందుకంటే ప్ర‌స్తుతం ఉన్న‌కృష్ణాజిల్లాను రెండుగా విభ‌జించారు. ఒక‌టి కృష్ణా, రెండు ఎన్టీఆర్ జిల్లా. ఇప్పుడున్న నానీలు.. ఇద్ద‌రూ కూడా కృష్ణాజిల్లా ప‌రిధిలోనే ఉన్నారు.

ఒక‌రు గుడివాడ‌, మ‌రొక‌రు మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి ఛాన్స్ చిక్కుతుంద‌నేది ప్ర‌శ్న‌. కొడాలి నానిని తీసుకుంటే.. ఆయ‌న సీఎం జ‌గ‌న్ కు అత్యంత ఇష్ట‌మైన నాయ‌కుడు. ఎందుకంటే.. చంద్ర‌బాబును లోకేష్‌ను ఈయ‌న మాదిరిగా.. ఎవ‌రూ తిట్టిపోయ‌రు కాబ‌ట్టి. ఇక‌, పేర్ని నాని.. కూడా జ‌గ‌న్‌కు ఇష్ట‌మైన నాయ‌కుడ‌నే చెప్పాలి. ఆయ‌న ఏ విష‌యాన్న‌యినా.. చాలా చ‌లోక్తుల‌తో మాట్లాడ‌తారు. ఉదాహ‌ర‌ణ‌కు టికెట్ల వివాదాన్ని ఆయ‌న ఎంత టాక్టిక‌ల్‌గా మాట్లాడారో అంద‌రూ చూసిందే.

ఇప్పుడు వీరిద్ద‌రూ కూడా కృష్నాజిల్లా ప‌రిధిలోనే ఉన్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు వ‌స్తున్న స‌మాచారం మేర‌కు సీఎం జ‌గ‌న్‌.. ఒక జిల్లా న‌నుంచి ఒక్క‌రికే ప్రాధాన‌న్యం ఇచ్చే ప‌క్షంలో ఈ ఇద్ద‌రు నానీల‌లో ఎవరికి ప్రాధాన్యం ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఒక‌వేళ‌.. జ‌గ‌న్ కొత్త‌ముఖాల‌కు అవ‌కాశం ఇవ్వాల‌న‌ని అనుకుంటే.. బీసీ సామాజిక వ‌ర్గం నుంచి జోగి ర‌మేష్ రెడీగా ఉన్నారు. సో.. ఆయ‌న‌కుమంత్రి ప‌ద‌వి ఇస్తే..  ఈ ఇద్ద‌రు నానీలు ఇంటి ముఖం ప‌ట్టాల్సిందేన‌ని అంటున్నాఆరు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 
Tags:    

Similar News