దేశంలో పెరుగుతోన్న కరోనా ఉధృతి... కొత్తగా ఎన్ని కేసులంటే

Update: 2021-08-06 07:26 GMT
మన దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి మళ్లీ 40 వేలకు పైగా కేసులు నమోదవుతోంది. గత 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 464 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం హెల్త్ బులెటిన్‌ ను విడుదల చేసింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,56,757 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,26,754 కి చేరింది.ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 41,096 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,10,15,844 కి పెరిగింది. అయితే.. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ప్రస్తుతం 4,14,159 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది.

కాగా నిన్న నమోదైన కేసుల్లో.. అత్యధికంగా కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో 22 వేలు, మహారాష్ట్రలో 9వేల మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ రేటు 1.30 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. కేరళలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. నిన్న 22,040 కొత్త కేసులు వచ్చాయి. మన దేశంలో సగం కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. కేరళలో 1,78,441 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో నిన్న 9026 మందికి కరోనా నిర్ధారణ అయింది. మన దేశంలో గురువారం 16,40,287 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం టెస్ట్‌ల సంఖ్య 47,65,33,650కి చేరింది. నిన్న 57,97,808 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 49,53,27,595 డోసుల టీకాలు వేశారు.




Tags:    

Similar News