బెజవాడ దుర్గమ్మ గుడిలో కరోనా అలజడి!

Update: 2020-08-07 11:00 GMT
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. పేద .ధనిక  - చిన్నా  - పెద్ద  - పల్లెలు - పట్టణాలు తేడా లేకుండా విస్తరిస్తోంది. అటు ఆలయాల్లో కరోనా కలవరాన్ని కలిగిస్తోంది.విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతోంది. తాజాగా  దుర్గ గుడి ఆలయంలోని సిబ్బంది - ఉన్నతాధికారులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. దుర్గ గుడి ఈవో సురేష్ బాబు కూడా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఆలయంలో మరో 18 మంది కరోనా బారిన పడ్డారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో పనిచేస్తున్న వేదపండితుడు రామకృష్ణ ఘనాపాటి కరోనా బారినపడి మరణించారు. మూడురోజుల క్రితం కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే గురువారం ఆయన కన్నుమూశారు.

ప్రస్తుతం ఆయన భార్య కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈవో సహా ఇప్పటి వరకు దుర్గగుడిలో 18 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. మరోవైపు, శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చేవారు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆలయ కమిటీ సూచిస్తోంది.
Tags:    

Similar News