పుట్టిన బిడ్డను అక్కడే వదిలి పారిపోయిన కరోనా రోగి!

Update: 2020-08-17 16:00 GMT
అప్పుడే జన్మించిన ఓ  శిశువును హాస్పిటల్ లోనే వదిలిపెట్టి ,అక్కడి నుండి పారిపోయింది ఓ తల్లి. ఈ ఘటనతో  కుటుంబ సభ్యులు , హాస్పిటల్ వర్గాలు షాక్ అయ్యారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ రావ్ హాస్పిటల్‌ లో చోటు చేసుకుంది. హాస్పిటల్ అధికారులు  తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని ఔరంగాబాద్ ‌కు చెందిన ఓ మహిళ తనకు డెలివరీ డేట్ దగ్గర పడటంతో కొన్ని రోజుల కిందట ఢిల్లీలోని హిందూ రావు హాస్పిటల్ ‌లో చేరింది. అయితే ఆమెకి కరోనా ఉందేమోననే అనుమానంతో  ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.

ఆ తరువాత , గర్భిణి అయిన ఆ మహిళకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. ఆగస్టు 11న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరుసటి రోజు ఉదయం హాస్పిటల్ సిబ్బంది కళ్లుగప్పి వార్డు నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు, హాస్పిటల్ వర్గాలు ఆమె కోసం వెతకగా.. ఆమె  ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని ఆ మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పుట్టిన శిశువుకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ ‌గా తేలింది. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ శిశువు వారి సంరక్షణలోనే ఉంది. అయితే.. పారిపోయిన మహిళ గురించే అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆమె నుంచి మరి కొంత మందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళనకు గురవుతున్నారు. ఆయితే , ఆ మహిళా పుట్టిన బిడ్డను అక్కడే వదిలిపెట్టి ఎందుకు  హాస్పిటల్ నుండి పారిపోయిందో తెలియడం లేదు. తనకి కరోనా ఉండటంతో తన నుండి తన బిడ్డకి ఏమైనా కరోనా సోకుతుందేమో అన్న భయంతో హాస్పిటల్ నుండి పారిపోయి ఉంటుంది అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  


Tags:    

Similar News