తాను అధికారంలోకి వస్తే ప్రతి లోక్ సభా స్థానాన్ని ఎంపీ స్థానంగా మారుస్తానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేసే పనిలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక కసరత్తును రెవెన్యూ శాఖ చేపట్టింది. ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చేక్రమంలో విచిత్రమైన పరిస్థితి ఒకటి తెర మీదకు వచ్చింది.
ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా.. 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. జగన్ ఇచ్చిన హామీని అమలు చేసిన పక్షంలో.. ఇప్పుడున్న 13 జిల్లాలు కాస్తా పాతిక జిల్లాలు కానున్నాయి. అయితే.. ఈ మార్పు కారణంగా.. కొత్త జిల్లాలుగా ఏర్పాటు అయ్యే ఎంపీ స్థానాల కారణంగా పాత జిల్లా పేర్లు కనుమరుగు కానున్నాయి. ఉదాహరణకు విశాఖ జిల్లానే తీసుకుంటే.. విశాఖ పేరుతో ఎంపీ స్థానం లేకపోవటంతో ఇప్పుడు ఆ జిల్లా పేరు కనుమరుగు కానుంది. దానిస్థానే అనకాపల్లి జిల్లా కానుంది. అదే సమయంలో గిరిజన జిల్లాగా అరకును ఏర్పాటు చేయనున్నారు.
గుంటూరు ఎంపీ స్థానం లేకపోవటంతో.. ఇప్పుడు పేరు మారనున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే గుంటూరు స్థానంలో నరసరావుపేట.. బాపట్ల జిల్లాలు ఏర్పాటు అవుతాయి. అదే జరిగితే.. ప్రస్తుతం ఉన్న జిల్లా పేర్లు పెద్ద ఎత్తున మారిపోవటం ఖాయం. పేర్ల చిక్కు ఇలా ఉంటే.. జిల్లాలుగా లేని లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు.. గ్రామాలు.. మండలాలు.. రెవెన్యూ డివిజన్లు ఇంకా మొత్తం నియోజకవర్గం పరిధిలోని భూవిస్తీర్ణం.. జనాభా.. అటవీ విస్తీర్ణం..సామాజిక జీవినం లాంటి అంశాల మీద అధ్యయనం చేసి డిటైల్డ్ రిపోర్ట్ ను సిద్ధం చేయనున్నారు.
ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు చూస్తే..
01. శ్రీకాకుళం
02. విజయనగరం
03. విశాఖపట్నం
04. తూర్పుగోదావరి (పరిపాలనా కేంద్రం కాకినాడ)
05. పశ్చిమగోదావరి(పరిపాలనా కేంద్రం ఏలూరు)
06. కృష్ణా (పరిపాలనా కేంద్రం మచిలీపట్నం)
07. గుంటూరు
0 8. ప్రకాశం
09. నెల్లూరు
10. కడప
11. కర్నూలు
12. అనంతపురం
13. చిత్తూరు.
పరిశీలనలో ఉన్న 25 కొత్త జిల్లాలు:
01. అనకాపల్లి (విశాఖ జిల్లా)
02. అరకు (విశాఖ జిల్లా)
03. అమలాపురం (తూర్పుగోదావరి)
04. రాజమండ్రి (తూర్పుగోదావరి)
05 నర్సాపురం (పశ్చిమగోదావరి)
06. విజయవాడ (కృష్ణా జిల్లా)
07. నర్సరావుపేట (గూంటూరు జిల్లా)
08. బాపట్ల (గూంటూరు జిల్లా)
09. నంద్యాల (కర్నూలు జిల్లా)
10. హిందూపురం (అనంతపురం జిల్లా)
11. రాజంపేట (కడప జిల్లా)
12. తిరుపతి (చిత్తూరు జిల్లా)