అగ్రరాజ్యం అమెరికాలో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో.. అక్కడి మధ్యతరగతి వారికే కాదు.. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లిన వారికి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైనట్లుగా తెలుస్తోంది. డాలర్ డ్రీమ్స్ లో భాగంగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలనే వారికి ఇదో కష్టంగా మారింది. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో అమెరికన్లకే అద్దె ఇల్లు దొరకటం సమస్యగా మారినట్లుగా చెబుతున్నారు. ఇప్పటి దాకా సొంతింట్లో ఉన్న వారు సైతం అద్దె ఇంటికి మారిపోవటం గమనార్హం.
ఎందుకిలా? అసలేం జరిగిందంటే.. కరోనా మహమ్మారి దేశాల ఆర్థిక పరిస్థితినే కాదు.. వ్యక్తిగత జీవితాల్ని.. ఆర్ఠిక పరిస్థితిని దారుణంగా దెబ్బ తీయటం తెలిసిందే. దీంతో.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్న వారు తమ సొంతింటిని వదిలించుకొని అద్దె ఇంట్లోకి మారిపోతున్నారు. ఈ కారణంగా అద్దె ఇంటికి అనూహ్యమైన డిమాండ్ పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కో అద్దె ఇంటికి నలుగురైదుగురు అప్లికేష్లు పెట్టుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పెరిగిన డిమాండ్ కు తగ్గట్లు.. అద్దెల్ని కూడా భారీగా పెంచేయటంతో.. అద్దె వ్యవహారం ఇప్పుడు కొత్త కష్టంగా మారింది.
అమెరికాలోని టంపా.. ఫ్లోరిడా.. టూ మెంఫిస్.. టెన్నస్సీ.. రివర్ సైడ్.. కాలిఫోర్నియా లాంటి ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు శరవేగంగా పెరుగుతున్నట్లుగా గుర్తించారు. ఒక నివేదిక ప్రకారం గడిచిన మూడు నెలల కాలంలో ఐదు లక్షలకు పైగా అద్దె ఇళ్లల్లోకి మారిపోయినట్లుగా చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వర్గాల వారి అంచనా ప్రకారం 1993 తర్వాత ఇంత భారీగా సొంతింటి నుంచి అద్దె ఇంటికి మారటం ఇదే తొలిసారిగా అభిప్రాయపడుతున్నారు.
కరోనా కారణంగా చోటు చేసుకున్న పరిణామాలు.. ఆర్థిక సమస్యల్ని వదిలించుకోవటానికి అద్దె ఇంటికి మారటమే పరిష్కారంగా పలువురు భావించటంతో అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో.. అద్దెలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. గత నెల గణాంకాలు తీసుకుంటే రికార్డు స్థాయిలో 96.9 శాతం అద్దె ఇళ్లు ఫిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ డిమాండ్ ను అద్దె ఇంటి యజమానులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అద్దెల్ని భారీగా పెంచేశారు. దీంతో.. అమెరికన్లకే ఈ భారం మోపటం ఇబ్బందిగా ఉందని.. ఇలాంటివేళలో.. డాలర్ డ్రీమ్స్ తో వెళ్లిన ఎన్నారైలకు కొత్త కష్టంగా మారినట్లు చెబుతున్నారు.