ఆశ్చర్యం.. అనూహ్యం కాకపోయినా ఆ స్థాయి వార్తనే ఇది. బీజేపీలో 25 ఏళ్లపాటు పనిచేసి.. ఓ దశలో ఆ పార్టీ అగ్ర నాయకత్వానికి సన్నిహితంగా మెలిగి.. బళ్లారిని గుప్పిట పట్టి.. కర్ణాటక రాజకీయాలను శాసించిన గాలి జనార్దన రెడ్డి వేరుకుంపటి పెట్టుకున్నారు. కొన్ని రోజులుగా బీజేపీకి దూరంగా ఉంటున్న ఆయన కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించారు. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కొన్నేళ్ల పాటు జైలు పాలైన జనార్దన్ రెడ్డి ఆ కేసులో బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు.
కల్యాణ రాజ్య ప్రగతి పక్ష కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో గాలి ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ పార్టీని ప్రకటించారు. అయితే, బళ్లారిలో బలమైన పట్టున్న ఆయన్ను పార్టీలోంచి వెళ్లొద్దని బీజేపీ నాయకత్వం గట్టిగా కోరింది. అయినా పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న గాలి కొత్త రాజకీయ పార్టీని స్థాపించి తీరాలని పట్టుదల చూపారు. నెల కిందటే ఈ మేరకు సంకేతాలిచ్చారు. తాజాగా పంతం నెగ్గించుకున్నారు. గాలి జనార్దన్ కొత్త పార్టీ కొన్ని వర్గాల ఓట్లపై ప్రభావం చూపవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
పోటీ అక్కడినుంచేనా??
కర్ణాటకలో 6 నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గాలి జనార్దన్ రెడ్డి పోటీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన భార్యతో కలిసి నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ అక్కడి ప్రజలతో మమేకయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, గంగావతిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి జనార్దన రెడ్డి రూ.6కోట్ల విరాళం ప్రకటించారు. దీనిపై క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వచ్చింది. అనంతరం కొన్ని రోజులుగా ఆ పార్టీ అధినాయకత్వానికి దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన సొంతంగా పార్టీని స్థాపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనార్దన్‌రెడ్డితో పాటు 9 మందిప సీబీఐ 2009లో గనుల అక్రమ తవ్వకాల కుంభకోణంలో కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబరులో జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసి జైల్లో వేశారు. నాలుగేళ్ల జైలు శిక్ష అనంతరం 2015 జనవరి 20న కొన్ని షరతులతో కూడిన బెయిలును సుప్రీంకోర్టు మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున బెయిలు షరతులను సడలించాలంటూ 2020లో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం.. ఎస్పీలకు తెలియజేసి బళ్లారి, కడప, అనంతపురం వెళ్లవచ్చంటూ ఆదేశాలిచ్చింది. ఇదే సమయంలో ట్రయల్ కోర్టులో విచారణ జాప్యం కావడం పై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఇప్పుడు ఏం జరగనుంది...?
కర్ణాటకలో ఎన్నికలకు మహా అంటే ఆరు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే అక్కడ బీజేపీ కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. యడియూరప్ప వంటి నాయకుడిని కాదని బొమ్మైని సీఎం చేయడం పెద్దగా లాభించినట్లు కనిపించడం లేదు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ బలంగా ఉంది. డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ అయ్యాక మరింతగా దూసుకెళ్తోంది.
మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా చురుగ్గానే ఉన్నారు. అటు కుమారస్వామి పార్టీ జేడీఎస్ 90 నియోజకవర్గ్లాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. కాబట్టి బీజేపీకి ఈ ఎన్నికలను ఎదుర్కోవాలంటే బాగా కష్టపడాలి. ఇదే సమయంలో గాలి జనార్దన రెడ్డి పార్టీని వీడడం పెద్ద షాకే. అందులోనూ మోదీ, షా వంటి నాయకులు ఉన్న కాలంలో ఓ రాష్ట్రంలో బలమైన నాయకుడు బీజేపీని వీడడం అంటే కొంత ఇబ్బందికర పరిణామమే. అయితే, దీనిని బీజేపీ అధిష్ఠానం చూస్తూ ఊరుకోకపోవచ్చు. మరోవైపు సుప్రీం అసహనం నేపథ్యంలో గాలి జనార్దన రెడ్డి మీద కేసులు విచారణ వేగం కావొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.