కేజ్రీవాల్‌పై ఢిల్లీలో సంచలన పోస్టర్లు

Update: 2015-04-08 07:20 GMT
ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి ఏక్‌ ఆద్మీ పార్టీగా మారిపోయిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆప్‌ పార్టీపై సెటెర్లు, విమర్శల దశ దాటుకొని పోస్టర్లు వేసేవరకు వెళ్లింది పరిస్థితి. కేజ్రివాల్‌  హిట్లర్‌ వలే నియంతృత్వ పోకడలు పోతున్నారని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. అలా పోల్చేందుకు తగు కారణాలను సైతం అందులో వివరించడం గమనారÛం.

భగత్‌ సింగ్‌ క్రాంతిసేన పేరుతో దేశరాజధానిలో వెలసిన ఈ పోస్టర్లలో కేజ్రీవాల్‌ మీసాలు, ఆయన ఆహార్యాన్ని హిట్లర్‌ తో పోలివుండేలా చిత్రీకరించారు. ఒకప్పటి తన అనుచరులు ఒక్కొక్కరినీ కేజ్రీవాల్‌ వదిలించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆప్‌ నుంచి బహిష్కరణకు గురైన యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌, అజిత్‌ ఝా, రాకేశ్‌ సినాÛ వంటివారిని ఆ పోస్టర్‌ లో ఉదహరించారు. మొత్తంగా ఆయన ప్రవర్తనే నాజీ నియంత హిట్లర్‌ ను పోలినట్లే ఉందని.. బహిష్కరించే లిస్టులో ఇంకా చాలామంది ఉన్నారని పోస్టర్‌ లో ఉంది.

అయితే ఈ పోస్టర్‌ వెనక బీజేపీ హస్తం ఉందని ఆప్‌ నేత అశుతోష్‌ ఆరోపించారు. హిట్లర్‌ భావజాలాన్ని బీజేపీ చాలా అభిమానిస్తుందని, ఆ పార్టీ సమావేశాల్లోనూ హిట్లర్‌ ను కొనియాడుతూ ప్రసంగాలు ఉంటాయని ఆయన చెప్పారు. బీజేపీ వ్యవస్థాపకుడు గురు గోవాల్కర్‌ రాసిన పుస్తకంలోనూ హిట్లర్‌ నుంచి స్పూర్తి పొందిన అనేక విషయాలు ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల సమయంలోనూ తమ పార్టీపై ప్రచార పోస్టర్లు వేశారని ఆరోపించారు.

Tags:    

Similar News