ప్రింట్ మీడియా యాడ్స్ కు కొత్త రూల్స్

Update: 2016-06-11 04:33 GMT
ప్రింట్ మీడియాకు ప్రకటనలు ఇచ్చే అంశానికి సంబంధించి ప్రభుత్వం సరికొత్త విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చింది. పుట్టగొడుగుల్లా వచ్చి పడుతున్న కొన్ని పత్రికలకు.. మ్యాగ్ జైన్లకు చెక్ పెట్టేలా ఈ రూల్స్ ఉండటం గమనార్హం. చిన్న.. చిన్న పత్రికల్ని ఏర్పాటు చేయటం.. లాబీయింగ్ తో ప్రభుత్వ ప్రకటనల్ని కొల్లగొట్టటం కొన్నేళ్లుగా సాగుతున్న తంతే. దానికి చెక్ పెట్టేలా ఏ ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఇందుకు భిన్నంగా తాజాగా సరికొత్త మార్గదర్శకాలు సిద్దం చేశారు.

తాజాగా విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి పత్రికకు నిర్దిష్టమైన మార్కులు వస్తేనే ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలన్నది రూల్ గా పెట్టుకున్నారు. వృత్తిపరంగా ప్రమాణాలు పాటించటంతో పాటు.. ఏబీసీ(ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్స్) రిపోర్ట్.. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియాతో తనిఖీ చేయించుకునే ప్రత్రికలను మాత్రమే ప్రోత్సహించనున్నారు.

ఆరు అంశాల్ని ప్రాతిపదికగా తీసుకొని విధివిధానాల్ని రూపొందించారు. సర్య్కులేషన్ తనిఖీకి 25 మార్కులు.. ఉద్యోగుల ఈపీఎఫ్ కు 20 మార్కులు.. పేజీల సంఖ్యకు 20.. పీటీఐ.. యూఎన్ ఐ లాంటి సంస్థల్లో వార్షిక సభ్యత్వం ఉంటే 10 మార్కులు కేటాయిస్తారు. ఆయా విభాగాల్లో వచ్చే మార్కుల ఆధారంగా యాడ్స్ ఇస్తారు. ఈ తరహా నిబంధనలతో చిన్న చిన్న పత్రికల ప్రయోజనాలకు భారీగా దెబ్బ తగలటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. పెద్ద పెద్ద మీడియా సంస్థలకు మాత్రమే యాడ్స్ వస్తాయే తప్పించి.. చిన్న చిన్న మీడియా సంస్థల ప్రయోజనాలకు భారీగా దెబ్బ తగులుతుందన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News