ఏపీలో తెరపైకి నాలుగో రాజధాని.. ఇదే?

Update: 2019-12-19 11:14 GMT
ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ జగన్ చేసిన ప్రకటనతో కొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. టీడీపీ ఈ మూడు రాజధానులు వద్దంటూ వ్యతిరేకిస్తుండగా.. బీజేపీ మాత్రం అధికార వికేంద్రీకరణకు రాజధానులు అవసరమే అంటూ సపోర్ట్ చేస్తోంది. జనసేన టీడీపీ బాటలోనే నడుస్తోంది.

అయితే తాజాగా ఏపీకి మరో రాజధాని కావాలంటూ రాయలసీమ పోరాట సమితి ఉద్యమించడానికి రెడీ అయ్యింది. తిరుపతిని ఏపీకి ఆధ్యాత్మిక రాజధానిని చేయాలంటూ రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే తిరుపతి సాక్షిగా ఉద్యమం చేపడుతామని స్పష్టం చేశారు. దేశ ప్రధాని నుంచి సీఎం వరకూ అందరూ వచ్చిదర్శించుకునే తిరుపతిని ఎందుకు రాజధాని చేయరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ పోరాట సమితి ఆధ్వర్యంలో తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని కోసం పోరుబాటకు శ్రీకారం చుట్టారు.

ఇన్నాళ్లు మూడు నగరాలకే పరిమితమైన ఈ లొల్లి ఇప్పుడు ఏపీలోని ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి పాకడం గమనార్హం. తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా ప్రకటిస్తే ఏపీకి నాలుగు క్యాపిటల్స్ అవుతాయి. మరి ఈ కొత్త  ప్రతిపాదనపై జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News