ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత.. టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయనకు బెయిల్ కూడా ఇంతవరకు రాలేదు. ఆ అరెస్టు చేసిన తరువాత ఈ కేసులో మరో మాజీ మంత్రి ప్రమేయం కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అతి త్వరలో ఆయనను కూడా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పటివరకు అచ్చెన్నాయుడు చుట్టూ తప్పా కేసు డైవర్ట్ కాలేదు.
అయితే ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో తాజాగా ట్విస్ట్ నెలకొంది. మాజీ మంత్రి పిథాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి పితాని కుమారుడు, అతని వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) మురళి మోహన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది.
ఈఎస్ఐ కేసులో ఇది ఊహించని మలుపుగా మారింది. బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేయడం ద్వారా, పితాని కుమారుడు సురేష్.. అతని పీఎస్ ఈ కేసులో బుక్కైనట్టుగానే అందరూ భావిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న ఏసీబీకి వీరి ప్రమేయంపై ఖచ్చితమైన ఆధారాలు లభించి ఉంటాయని.. అందుకే వారిద్దరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదేమైనా, బెయిల్ పిటిషన్ పై మంత్రి పితాని, ఆయన కుమారు సురేష్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఈ కుంభకోణంలో పితాని, ఆయన కుమారుడు సంబంధం కలిగి ఉన్నాడా లేదా అన్నది ఇంతవరకు బహిర్గతం కాలేదు. ఏసీబీ సైతం అధికారికంగా బయటపెట్టలేదు. ముందస్తుగా వారే బెయిల్ కోరడంతో ఈ ప్రచారం మొదలైంది.