చైనాలో కొత్త వేరియంట్.. జీరో వ్యూహం అమలు, ప్రజల ఆందోళన

Update: 2022-03-26 09:09 GMT
కరోనా కేసుల పెరుగుదల వల్ల కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. పలు దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గుతున్నా... చైనా, హాంగ్ కాంగ్ వంటి దేశాల్లో కరోనా మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ తో ఆ దేశంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మార్చి నెలలో ఇప్పటివరకు 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

అయినప్పటికీ కోవిడ్ కట్టడికి అన్ని వ్యూహాలతో ముందుకెళ్తున్నామని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. చైనాలో పెరుగుతున్న కోవిడ్ ఇన్ఫెక్షన్ల విస్తృతి దృష్ట్యా పెద్ద పెద్ద నగరాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోతున్నాయి. మార్చి 1 నుంచ ఇప్పటి వరకు 56 వేల కేసులు నమోదైనట్లు చైనా హెల్త్ మిషన్ అధికారులు పేర్కొన్నారు.

హాంగ్ కాంగ్ లో నమోదవుతున్న కేసుల్లో వీటికి అదనం. అయినప్పటికీ డైనమిక్ జీరో కోవిడ్ లక్ష్యాన్ని స్వల్ప కాలంలో సాధించేందుకు కృషి చేస్తున్నామని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణులు వూ జూన్ యూ పేర్కొన్నారు. చైనాలో కరోనా విస్తృతి పెరుగుతున్నప్పటికీ జీరో కోవిడ్ వ్యూహానికి కట్టుబడి ఉన్నట్లు చైనా స్పష్టం చేసింది.

ఈ వ్యూహంతో లాక్ డౌన్ లు, భారీ స్థాయిలో కొవిడ్ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి కఠిన చర్యలు చేపడుతూ కేసుల సంఖ్యను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించింది. అయినప్పటికీ వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. డైనమిక్ కొవిడ్ జీరో వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా నగరాలపై ఒకే సారి ఆంక్షలు విధించకుండా స్థానికంగా పరీక్షలు, కట్టడి చర్యలతో ముందుకు వెళ్తామని పేర్కొంది.

చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ... దేశంలోని చాలా మందికి టీకా చేరలేదని తెలుస్తోంది. ఆ దేశ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 60 ఏళ్ల వయసు పైబడిన వారిలోనే ఇంకా 5 కోట్ల మందికి ఒక డోసు టీకా కూడా తీసుకోలేదు. బూస్టర్ డోసుల పంపిణీ పకూడా మందకడిగానే సాగుతుంది.

హాంగ్ కాంగ్ లోనూ కోవిడ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నెల రోజులుగా అక్కడ నిత్యం 200 కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి రోజూ పది వేలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవతున్నాయి. ఇటీవల మొదలైన వేవ్ లో ఒక్క హాంగ్ కాంగ్ నగరంలోనే పది లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఆ దేశ ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ విధించడం గానీ, ప్రతీ ఒక్కరికీ రెండు డోసుల టీకా ఇవ్వడం వంటివి చేయట్లేదు.

ఇలాంటి నిర్ణయాల పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కరోనా కొత్త వేరియంట్ నాలుగో వేవ్ తో విజృంభిస్తోంది. ఈ విషయాలను ఆ దేశ ప్రభుత్వం మరో సారి పునరాలోచించుకొని సంపూర్ణ లాక్ డౌన్ విధించడం వల్ల ప్రజలను కాపాడుకోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News