ముచ్చట పడి.. మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని.. ఇంటికి తెచ్చుకున్న పెళ్లాం.. జీవితాంతం తోడు నీడగా ఉండటం తర్వాత సంగతి.. అమ్మడు దెబ్బకి పోలీసుల చుట్టూ తిరటమే సరిపోతున్న ఓ కొత్త పెళ్లి కొడుకు ఉదంతమిది. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి విన్న వారంతా అవాక్కు అయ్యే పరిస్థితి.
యూపీలోని ఫరూకాబాద్ జిల్లాలకు చెందిన ఉమాశంకర్ అనే వ్యక్తి ఇటీవల నేహా అనే యువతిని ముచ్చటపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తంతు పూర్తి చేసుకొని కాపురానికి తీసుకొచ్చాడు. కొత్త పెళ్లం మీద కోటి ఆశలతో కల కంటూ నిద్రపోయాడేమో కానీ.. ఉలిక్కిపడి నిద్ర లేచిన అతనికి షాక్ తగిలే పరిస్థితి. పడుకున్న చోట కాళ్లు.. చేతులు కట్టేసి కొత్త పెళ్లానికి వారి కుటుంబ సభ్యులు సాయం చేయటం చూసి అతగాడు షాక్ కి గురయ్యాడు.
తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న అతగాడిని కొట్టేసిన వారు.. ఇంట్లోని వస్తువులతో పాటు.. అక్కడే ఉన్న జీపును తీసుకొని పారిపోయారు. తెల్లారిన తర్వాత సోదరుడి కొత్త కాపురం చూద్దామని వచ్చిన ఉమాశంకర్ బ్రదర్.. కట్లు విప్పదీసి..ప్రధమ చికిత్స చేశారు. కొత్త పెళ్లాం ఎంతపని చేసిందని ఉరుకులు పరుగులతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసుల్ని తీసుకొని.. పెళ్లి కూతురు ఇంటికి వెళితే.. అక్కడ తాళం వెక్కిరిస్తూ ఉండటంతో.. ఏం చేయాలో పాలుపోక ఊసురుమంటూ తిరుగు ముఖం పట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిలాడీ లాంటి కొత్త పెళ్లికూతురి కోసం వెతుకులాట మొదలు పెట్టారు.