మరోసారి పెళ్లి చేసుకోనున్న ఐఏఎస్ టాపర్.. పెళ్లి కొడుకు తెలిస్తే అవాక్కే!
దాదాపు ఏడేళ్ల క్రితం (2015) సివిల్స్ టాపర్ గా నిలిచిన వార్తల్లోకి నిలిచారు టీనా దాబి. చాలామంది సివిల్స్ అధికారులకు లేని ఇమేజ్ ఆమె సొంతం. విధి నిర్వహణలో ఆమెకున్న పేరు ప్రఖ్యాతులతో పాటు.. సోషల్ మీడియాలోనూ ఆమెకు బోలెడంత క్రేజ్ ఉంది. ఆమె ఇన్ స్టాను 14 లక్షల మంది ఫాలో అవుతుంటారంటేనే ఆమెకున్న ఇమేజ్ ఎంతటితో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. టాప్ ర్యాంకర్ గా దళిత మహిళ నిలవటంతో దేశ వ్యాప్తంగా ఆమె పేరు మారుమోగింది.
2015 టాపర్ గా నిలిచిన ఆమె.. తన బ్యాచ్ కు చెందిన రెండో ర్యాంకర్ అదర్ అమీర్ ఖాన్ ను ప్రేమ వివాహం చేసుకోవటం.. అది కాస్తా మతాంతర వివాహం కావటంతో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ట్రైనింగ్ సమయంలో వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వెళ్లటం.. ఈ జంట పెళ్లికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అప్పటి కేంద్రమంత్రులు.. లోక్ సభ మాజీ స్పీకర్ (అప్పటి) సుమిత్రా మహజన్ లాంటి ప్రముఖులు ఎందరో హాజరై.. ఈ జంటకు ఆశీర్వాదాలు తెలియజేశారు. ధూంధాంగా సాగిన పెళ్లి వేడుక అప్పట్లో వార్తాంశంగా మారాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. వీరి వివాహ బంధం కేవలం రెండేళ్ల పాటు మాత్రమే సాగటం.. ఆ తర్వాత విభేదాలతో వీరిద్దరూ విడిపోయారు. మనస్పర్థల కారణంగా వారు 2017లోనే విడిపోయారు. గత ఏడాది వీరికి అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి టీనా దాబి వార్తల్లోకి వచ్చారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె.. తాను మరో పెళ్లి చేసుకుంటున్న విషయాన్నిఅధికారికంగా వెల్లడించారు.
తాజా వరుడు కూడా ఐఏఎస్ అధికారే. అయితే.. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టీనా కంటే ఆయన పదమూడేళ్లు పెద్ద వయస్కుడు కావటం విశేషం. సివిల్స్ లో తన కంటే రెండేళ్లు సీనియర్ అయిన ఆయన పేరు ప్రదీప్ గవాండే. తామిద్దరం త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లుగా ఆమె వెల్లడించారు. ఇటీవల వారిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది.
అందుకు సంబంధించిన ఫోటోల్ని టీనా షేర్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరు రాజస్థాన్ క్యాడర్ లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ పురాతత్వ.. మ్యూజియం శాఖ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా తన రెండో పెళ్లి వేళలోనూ టీనా రోటీన్ కు భిన్నంగా వ్యవహరించిందన్న మాట వినిపిస్తోంది. తన కంటే వయసులో చాలా పెద్ద వాడిని వివాహం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.