ఔను! ఇప్పుడు ఈ మాటే సర్వత్రా వినిపిస్తోంది. సర్పంచుల అధికారాల్లో కోత.. నిధుల విడుదలలో కోత.. ఇలా.. అనేక రూపాల్లో పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ గ్రామ పంచాయతీలపై ఉక్కుపాదం మోపుతున్నారనే వాదన వినిపిస్తోంది. గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్‌లను దూరం చేయడంతో ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. పంచాయతీల ఖాతాల్లో నిధులు అందుబాటులో లేకపోవడంతో సర్పంచులు నిస్సహాయులవుతున్నారు. దీంతో గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
వైసీపీ సర్కారు వచ్చిన వెంటనే అప్పటి వరకు గ్రామాల్లో ఉపాధి పథకం ద్వారా చేపట్టిన మెటీరియల్ పనులకు నిధులు నిలిపేశారు. అప్పటి వరకు పంచాయతీల్లో మంజూరైన పనులన్నీ రద్దు చేశారు. మాజీ సర్పంచ్‌లు చేపట్టిన పలు పనులకు బిల్లులు పెండింగ్ పెట్టారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా ఇతర అవసరాలకు వాడుకున్నారు. మాజీ సర్పంచ్‌లు కోర్టుకెక్కడంతో ఆయా పనులపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టి వేధించారు. చివరకు కోర్టు ఆదేశాలతో 75శాతం మాత్రమే బిల్లులు చెల్లించారు. ఇంకా 25శాతం పెండింగ్‌లోనే ఉన్నాయి.
బిల్లులు సకాలంలో రాకపోవడంతో పనులు చేసిన మాజీ సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారు. కొంతమంది ఆస్తులు అమ్ముకోగా, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టాలని కేంద్రం నిర్దేశించినా గ్రామ సచివాలయాలు, ప్రైవేట్ సిబ్బందితోనే కొనసాగిస్తున్నారు. సచివాలయాలతో సమాంతర పాలన గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో గ్రామాల్లో సర్పంచ్‌ల పాత్ర లేకుండా సమాంతర వ్యవస్థను రంగంలోకి దించారు. 50 కుటుంబాలకు ఒకరు చొప్పున 2.5 లక్షల మంది వైసీపీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించారు.
గ్రామ పంచాయతీలు నిర్మించుకున్న పంచాయతీ భవనాలను సచివాలయాలుగా మార్చారు. పంచాయ తీ నిధులను సచివాలయాల నిర్వహణకు వినియోగించుకుంటూ సర్పంచ్‌కు, పంచాయతీలకు ఎలాంటి అధికారాలు లేకుండా లాగేసుకున్నారు. గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు మాత్రమే తీసుకుని పనులన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బాటలో పంచాయతీల్లో నాటిన మొక్కలను 80శాతం బతికించలేకపోతే సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామని చట్టం తీసుకొచ్చారు.
ఇక, గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇవ్వకపోగా... కేంద్రం విడుదల చేస్తున్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసింది. మొదట్లో విద్యుత్ బకాయిల పేరిట పంచాయతీల నుంచి భారీ మొత్తంలో ఆర్థిక సంఘం నిధులు మినహాయించుకున్నారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకుండా నేరుగా పీడీ ఖాతాల్లో జమ చేసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఉద్యమ బాట పట్టాయి. ఆర్థిక సంఘం నిధులతో పాటు గ్రామ పంచాయతీలు పన్నుల రూపంలో వసూలు చేసుకున్న నిధులను కూడా లాగేసుకోవడంతో సర్పంచ్‌లు ఆందోళనకు దిగాల్సి వచ్చింది.
తాజాగా తమ కు కేటాయించిన నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించడంపై నిరసన వ్యక్తం చేస్తూ.. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టెలి దాసుబాబు గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇదే తీరులో మరికొన్నిచోట్ల సర్పంచులు, సభ్యులు.. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. రాబోయే రోజుల్లో సర్పంచులు ఇక, గుండు గీసుకోవడమే మిగులుతుందని అంటున్నారు పరిశీలకులు.