AP: ఇదే చివరి కేబినెట్ భేటీ యా ?

Update: 2022-03-30 08:30 GMT
మంత్రుల్లో చాలా మందికి వచ్చే నెలలలో జరగబోయే క్యాబినెట్ భేటీయే చివరది అయ్యేట్లుంది. ఏప్రిల్ 7వ తేదీన జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది. మంత్రివర్గ పునర్వవ్యస్ధీకరణపై మీడియాతో పాటు సోషల్ మీడియాలో రకరకాల కాంబినేషన్లతో ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గం నుండి వీళ్ళని తీసేయబోతున్నట్లు కొందరిని, కొత్తమంత్రులంటు మరికొందరి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి.

నిజానికి వెళ్ళిపోయే వాళ్ళెవరు, కొత్తగా క్యాబినెట్లోకి చేరేవారెవరు అనే విషయాలు జగన్ కు తప్ప రెండో వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. అలాంటిది క్యాబినెట్ సమావేశం తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సహజంగానే అందరిలోను టెన్షన్ పెరిగిపోతుంటుంది. క్యాబినెట్ మీటింగ్ లోనే మంత్రుల రాజీనామాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజీనామాలు చేసిన మంత్రులు జాబితాను, కొత్తగా చేర్చుకోబోయే మంత్రుల జాబితాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు జగన్ అందిస్తారు.

ఎందుకంటే 7వ తేదీన క్యాబినెట్ సమావేశమైతే 8వ తేదీన గవర్నర్ అపాయిట్మెంట్ తీసుకున్నారు. మంత్రుల జాబితాలను గవర్నర్ కు ఇవ్వటానికే జగన్ అపాయిట్మెంట్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయమని నేతలంటున్నారు. మంత్రులతో చేయించిన రాజీనామాలను గవర్నర్ దగ్గరకు పంపించే అవకాశాలున్నాయట. లేదా రాజీనామాలు చేసిన మంత్రుల జాబితాను మాత్రమే గవర్నర్ కు పంపే అవకాశముందంటున్నారు.

ఏదేమైనా 8వ తేదీన గవర్నర్ ను కలిసినపుడు డైరెక్టుగానే జగన్ అన్నీ విషయాలను వివరిస్తారని తర్వాత 11వ తేదీ ముహూర్తాన్ని కూడా చెప్పి అందుకు ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ను జగన్ కోరబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనించిన తర్వాతే 7వ తేదీన జరగబోయే క్యాబినెట్ సమావేశమే చాలా మందికి చివరి సమావేశమని అర్ధమైపోతోంది. కేబినెట్ భేటీ సందర్భంగానే జగన్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారట. మంచి భోజనం పెట్టించి మంత్రులను సాగనంపేందుకు జగన్ రెడీ అయిపోతున్నారు.
Tags:    

Similar News