ఎప్పటికప్పుడు తప్పిదాలు చేయడంలో ఆనందం ఉందా లేదా బాధ్యతా రాహిత్యం ఉందా? తప్పులు చేయడంలో వింత పోకడలు ఎందుకు అనుసరిస్తారంటే సమాధానం ఏం అని రాయాలి? ఏం అని వెతకి రావాలి? పాలన పరంగా వైఎస్ కన్నా జగన్ కు తక్కువ మార్కులే పడతాయి. అయితే కొంతలో కొంత నియంతృత్వ ధోరణిలో ఆయన పోతున్న కారణంగా కొన్ని ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. ఆ విషయమై పెద్దాయనతో జగన్ కు పోలిక లేదు. ఏదేమయినప్పటికీ పెద్దాయనతో జగన్ కు పోలిక లేదు కానీ చంద్రబాబుతో మాత్రం కొన్ని విషయాల్లో జగన్ ను పోలిక తేవచ్చు.
ఎందుకంటే పాలన పరంగా పదే పదే చేసిన తప్పిదాలే చేస్తున్నారాయన. వీటిలో దిద్దుబాటు లేకుండా పోతోంది. మంత్రి వర్గం పదవులు తరువాత పరిణామాలు సర్దుకున్నాక కూడా ఇంకా తప్పిదాల దిద్దుబాటు మొదలుకాలేదు. అంటే ఆయన జనంలో లేరు. ఆయన సీఎంఓలో ఉన్నారు. ఆయన ప్రజల్లో లేరు. ఆయన పదవుల పంపకం తదితర గొడవల్లో ఉన్నారు అని వైసీపీ ఫక్తు అభిమానులు బాధపడుతున్నారు.
దిద్దుబాబు పాలనలో మొదలయితే మంత్రులను మార్చి ప్రయోజనం ఉంటుంది. కానీ అదే ఇప్పుడు కొంత ఇబ్బందిగా ఉంది. ఈనెల 11న పునర్వ్యస్థీకరణ అయింది. మంత్రులు పూర్తి స్థాయి బాధ్యతలు అందుకున్న దాఖలాలు ఇంకా లేవు. ఇంకా సంబరాలు ఆనందాలు ఊరేగింపులు ఊరేగింపుల్లో విషాదాలు విషాదాంతాలు కూడా నెలకొంటున్నాయి. వీటిని ఆపి పాలనపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలే వస్తాయి అనేందుకు గతంలో నెలకొన్న ఉదాహరణలు చాలా ఉన్నాయి. బాబు మాదిరే ఆయన తప్పులు దిద్దుకోవడంలో వెనుకంజలో ఉన్నారని వైసీపీ లో అంతర్గతంగా వినిపిస్తున్న మాట.
సీఎంఓ ఆ రోజు ఆయన దాటి రాలేదు.ఇప్పుడు ఈయన కూడా దాటి రావడం లేదు. అదేవిధంగా ఐఏఎస్ లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా కోర్టు వాకిట శ్రీలక్ష్మి అనే సీనియర్ ఐఏఎస్ మళ్లీ అక్షింతలు పడ్డాయి. ఇప్పటికీ స్కూళ్లలో ఆర్బీకేలు, సచివాలయాలు తొలగించలేదు అని హై కోర్టు నిన్న మండిపడింది. అదేవిధంగా ఇప్పటికే ధిక్కారం కింద ఆ ఎనిమిది మంది ఐఏఎస్ లకు సామాజిక శిక్ష విధించింది. దీనిని పునః సమీక్ష చేయాలని శ్రీలక్ష్మీ దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది.
అంతేకాకుండా తాము ఆదేశాలు ఇచ్చినా ఇంకా కొన్ని చోట్ల అదేవిధంగా పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జ్యుడిషయల్ ఎంక్వైరీకి ఆదేశించింది.ఇవన్నీ అడ్మిన్ లోపాలే..వీటిని నిలువరించాల్సిన బాధ్యత జగన్ దే!