వైసీపీలో తర్జన భర్జన జరుగుతోంది. ఆ ఏడు నియోజకవర్గాల్లో ఎంత మంది గెలుపు గుర్రంఎక్కుతారు? అనే చర్చజోరుగా సాగుతోంది. ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని ఏకైక పార్లమెంటు స్థానం హిందూపురం. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాప్తాడు, హిందూపురం, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, మడకసిర, పెనుకొండలు ఉన్నాయి. వీటిలో ఒక్క హిందూపురం మాత్రమే టీడీపీ దక్కించుకుంది.
మిగిలిన ఆరు చోట్ల కూడా.. వైసీపీ గెలుపుగుర్రం ఎక్కింది. అయితే.. ఈ ఆరు స్థానాలే కాకుండా.. హిందూ పురం కూడా దక్కించుకుని.. బాలయ్యను కూడా ఓడించాలని.. స్థానిక నాయకులు భావిస్తున్నారు. ఇది నిన్నమొన్నటి వరకు ఉన్న టార్గెట్. ఎందుకంటే.. రాజకీయాల్లో ఎవరూ ఎక్కువకాదు.. తక్కువ కాదు. సో.. బాలయ్య అయినా.. రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. సో.. ఆయనను కూడా ఓడించేందుకు ప్రత్యర్థిపార్టీగా ప్రయత్నం చేయొచ్చు.
కానీ, ఇక్కడ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హిందూపురం మాట పక్కన పెడితే.. మిగిలిన ఆరు నియోజ కవర్గాలలోనూ.. నాయకులు తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. ఎక్కడికక్డక అధికారులపై చిందులు తొక్కుతున్న నాయకులు.. ఒకవైపు.. ఉంటే.. మరోవైపు .. హిందూపురం ఎంపీ న్యూడ్ ఎపిసోడ్‌ను ఇక్కడి ప్రజలు మరిచిపోలేకపోతున్నారట. హిందూపురం ఎంపీ మాధవ్ ముందు నుంచి కాంట్రవర్సీగానే ఉన్నారు.
ఇక ఈ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లో తమ మార్క్ ముద్ర వేయలేదు. దీంతో నాయకులు ఎక్కడికి వెళ్లినా.. ఆయన సంగతి ఏం చేశారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారట. దీంతో ఎమ్మెల్యేలు ఏం చెప్పాలో తెలియక.. అధిష్టానం.. సీరియస్‌గా ఉందని చెబుతూ దీనిపై ఏమీ మాట్లాడకుండానే వెనుదిరుగుతున్నారు. ఇక, మరికొందరు దీనిపై తీవ్ర అసహనంతోనూ ఉన్నారని టాక్.
ఈ పరిణామాలకు తోడు.. టీడీపీ దూకుడు మామూలుగా లేదు. ఇప్పటికీ ఎంపీ న్యూడ్ భాగోతాన్ని.. ప్రజల మధ్య లైవ్‌లోనే ఉంచుతున్నారు .టీడీపీ యువ నేతలు. దీంతో ప్రజలు దీనిని మరిచిపోయేలా చేయాలని అనుకున్నా.. నాయకులకు మాత్రం సాధ్యం కావడం లేదట. ఇదీ.. సంగతి. దీంతో ఎన్ని నియోజకవర్గాల్లో గెలుస్తాం.. ఓడుతాం.. అనే లెక్కలు వేసుకుంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.