ఎంతైనా గుజరాత్ వాళ్లు.. ఒకే రాష్ట్రం వాళ్లు.. గుజరాత్ ను ఏలిన వాళ్లు.. ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నారు అంతే తేడా.. కాలం కలిసి వచ్చి.. ప్రతిపక్షం పలుచనై.. మోడీ ప్రధాని అయ్యారు. ప్రత్యర్థి గట్టిగా ఉంటే కథ వేరేగుండేది. ఇప్పటికే బీజేపీలో 70 ఏళ్లు పైబడిన వారిని.. యాక్టివ్ గా ఉన్న వారందరినీ పక్కనపెట్టిన మోడీ షాల ద్వయం వారిద్దరి సీట్లను మాత్రం భద్రంగానే ఉంచుకుంటున్నాయి. 2014 కేబినెట్ లో కేంద్రమంత్రులుగా చేసిన రవిశంకర్, జవదేకర్ లాంటి ఎంతో మంది యాక్టివ్ బీజేపీ నేతలను సాగనంపారు. ఇప్పుడున్న కేబినెట్ లో అన్నీ కొత ముఖాలే.
బీజేపీలో పనిచేసే సామర్థ్యం ఉన్న వారిని కూడా పక్కనపెట్టిన చరిత్ర మోడీ షాలదీ.. అలాంటి వారు 2024లో బీజేపీకి ముఖం లాంటి మోడీని తప్పించగలరా? 70 ఏళ్లు దాటిన మోడీకి విశ్రాంతినిచ్చి.. యువకుడైన యూపీ సీఎం యోగిని పీఎం చేయగలరా? అంటే అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. అస్సలు అలాంటి ఆలోచనను కూడా లేదని కుండబద్దలు కొట్టారు.
మోడీ నమ్మిన బంటు అయిన అమిత్ షా తాజాగా 2024లో బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానిపై క్లారిటీ ఇఛ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రధాని నరేంద్రమోడీనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఇక జేడీయూతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నిజానికి 2024 ఎన్నికల్లో మోడీ రిటైర్ అవుతారని.. ఆయన స్థానంలో బీజేపీ యూపీ సీఎం యోగిని తెరపైకి తెస్తుందనే ప్రచారం జరిగింది. యూపీ ఎన్నికల వేళ అమిత్ షా కూడా దీనికి సరేనన్నట్టు తలూపారు. ఎన్నికలకు రెండేళ్లు ఉండడంతో మరోసారి బీజేపీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చేశారు. మోదీనే తమ అభ్యర్థి అని కార్యకర్తలకు స్పష్టం చేశారు.
బీజేపీలో మోడీ తప్ప వేరే ముఖం లేదు. జనాలు ఆయన ముఖం చూసే ఓటేస్తున్నారు. ఆయనను పక్కకు తప్పించే ధైర్యం ఎవరికీ లేదు. మోడీ పోతే బీజేపీ సున్నానే. అలాంటి చరిష్మా గల నేత లేరు. అందుకే మోడీని పక్కనపెడితే బీజేపీని ప్రజలు పక్కనపెడుతారు. ఇక మోడీని కాదని అమిత్ షా వేరొకరిని పీఎం చేస్తాననడం కల్లే. వారిద్దరే దేశాన్ని ఏలుతారు. మూడొకరు రాకుండా ఇప్పటికీ అందరినీ ఇంటికి పంపించారు. యూపీ సీఎం యోగిని కూడా తప్పించాలని చూసినా సాధ్యం కాలేదు. ఈ తోడు ద్వయం ఇప్పట్లో మారరు.. ప్రజలు మారిస్తే తప్పా..