సోమూ.. మ‌రీ ఇంత ఎక‌సెక్కాలా? ఆమెప్పుడైనా జెండా ప‌ట్టుకుందా?: నెటిజ‌న్లు

Update: 2022-12-30 14:56 GMT
ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు ఎక‌సెక్కాలు ఎక్కువయ్యాయ‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఎందుకంటే.. ప‌ర‌మ‌ప‌డిందించిన మోడీ మాతృమూర్తి హీరాబెన్‌ను కూడా బీజేపీకి అంట‌గ‌ట్టేయ‌డ‌మే!!ఈ క్ర‌మంలోనే ప్ర‌తి విష‌యంలోనూ.. ప్ర‌తి కోణంలోనూ.. ఆయ‌న రాజ‌కీయంగా చూస్తున్నార‌ని నెటిజ‌న్లు వ్యాఖ్య‌నిస్తున్నారు. దీనికి కార‌ణం.. వంద వ‌సంతాలు పూర్తి చేసుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాతృమూర్తి.. హీరాబెన్ శివైక్యం చెందారు(మా అమ్మ శివుడి చ‌ర‌ణాల చెంత‌కు చేరింద‌ని ప్ర‌ధానే స్వ‌యంగా రాసుకున్నారు). వ‌య‌సు రీత్యా చూస్తే.. ఆమె పూర్ణాయుర్ధాయం( పూర్ణాయుర్ధాయం అంటే వాస్త‌వానికి 80 ఏళ్లు) పూర్తి చేసుకున్నారు.

హాయిగా.. కుమారులు అంద‌రూ వృద్ధిలోకి వ‌చ్చారు. కాబ‌ట్టి ఏ చీకూ చింతా పేద్ద పేద్ద అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొన‌కుండా.. వెళ్లిపోయారు. ఇక‌, దేశాధినేత మోడీ మాతృమూర్తి కాబ‌ట్టి.. స‌హ‌జంగానే సంతాపాలు.. వ్య‌క్తం చేయొచ్చు.

ఇది అవ‌స‌రంకూడా. బాధ‌లో ఉన్న మోడీకి ద‌న్నుగా నిల‌వ‌డం త‌ప్పు కూడా కాదు. అయితే.. దీనిని ఆలంబ‌న‌గా చేసుకుని.. `రెచ్చిపోవ‌డం` ఎందుకు అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. నిజానికి ఉద‌యం నుంచి అనేక మంది మోడీకి సంతాపం తెలిపారు. ఎవ‌రూ కూడా సోము మాదిరి రెచ్చిపోలేదు. అమ్మ‌ను అమ్మ‌లానే చూశారు! అమ్మ‌లో రాజ‌కీయం వెత‌క‌లేదు.

కానీ.. సోము వీర్రాజు మాత్రం.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ  తల్లి హీరాబెన్ మరణం భారతదేశానికి, ప్రధానంగా బీజేపీకి తీరని లోటని సోమువీర్రాజు అన్నారు. పధాదికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహరావు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొని ముందుగా ప్రధాని మోడీ తల్లి మృత్తి పట్ల సంతాపం తెలిపారు.

ఇందులో అంతుచిక్క‌ని విష‌యాలురెండే రెండు.. ఒక‌టి హీరాబెన్‌.. ఎప్పుడూ.. బీజేపీ జెండా మోయ‌లేదు.. ఆ పార్టీ త‌ర‌ఫున ఆమె మాట్లాడ‌లేదు. సాధార‌ణ మ‌హిళ స్థాయి నుంచి అసాధార‌ణ మ‌హిళ‌గా మాత్రం ఎదిగారు. కానీ, ఆమె మ‌ర‌ణాన్ని కూడా బీజేపీకి సోము ముడిపెట్ట‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు సంతాపం తెలిపిన వారు ఎవ‌రూ ఇలా వ్యాఖ్య‌లు చేయ‌లేదు. అందుకే నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News