చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రజలను గడగడలాడిస్తోంది. తన రూపు మార్చుకుంటూ కొత్త కొత్త వేకియంట్ల తో ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తోంది. అయితే కరోనా థర్డ్ వేవ్ ముగిసిన తర్వాత మళ్లీ ఇప్పుడు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే చాలా రాష్ట్రాలు కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ను ధరించడాన్ని తప్పనిసరి చేశారు.
గత వారం కరోనా నాలుగే వేవ్ భయం నేపథ్యంలో దిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, కేరళ, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్కు ధరించాలనే నిబంధను తిరిగి తీసుకువచ్చాయి. అయితే నిబంధనలు ఉల్లంఘించి అంటే మాస్కు ధరించకపోతే 500 రూపాయల జరిమానా విధిస్తామని దిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. కచ్చితంగా మాస్కులు ధరించే తిరగాలని.. అలాగే రెండు డోసుల టీకాలతో పాటు అర్హులంతా బూస్టర్ డోస్ తీసుకోవాలని వివరించింది.
ముఖ్యంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాజధాని లక్నో, ఆరు ఎన్సీఆర్ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. హర్యానా ప్రభుత్వం జాతీయ రాజధాని ప్రాంతం లోని నాలుగు జిల్లాల్లో ముఖానికి మాస్కు ధరించడం కచ్చితం చేసింది. అలాగే గురుగ్రామ్ లో గత కొంత కాలంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
అందుకోసం ఫరీదాబాద్, సోనిపట్, ఝుజ్జర్ జిల్లా మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసినట్లు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర ఇండోర్ సమావేశాల్లో ప్రజలు ప్రత్యేకంగా మాస్కులు ధరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
కర్ణాకట ప్రభుత్వం కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడాన్ని తప్పనిరి చేసింది. అలాగే తమిళనాడు, కేరళ ప్రభుత్వం కూడా మాస్కుల వాడకాన్ని కచ్చితం చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది. గోవా రాష్ట్రంలో తాజాగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అందుకు వారు కూడా మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేశారు.
ఛత్తీస్ ఘడన్, ఛండీగఢ్, తెంలగాణ, మహారాష్ట్రలలో మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఆయా రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. కానీ చాలా మంది మాస్కులు లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నారు. దీని వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీసం రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోస్ అయినా తీసుకొని కరోనా నుంచి ప్రాణాలు రక్షించుకోండి.