ఎందుకంటే గంటా ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది ఒక కీలకమైన ప్రశ్న అనుచరులలో ఉంది. గంటా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి భీమునుపట్నాన్ని కోరుకుంటున్నారు. ఆయన 2014లో ఫస్ట్ టైం అక్కడ నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. ఒక విధంగా అది సెంటిమెంట్ నియోజకవర్గం, 2019లో కూడా అదే సీటు ఆయన కోరుకుంటే చంద్రబాబు ఆయన్ని విశాఖ నార్త్ కి పంపించారు. అయిష్టం మీద పోటీకి దిగినా జగన్ వేవ్ ని తట్టుకుని గంటా మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.
ఇక 2024లో మాత్రం భీమిలీకే గంటా ఓటు వేస్తున్నారు. కాదూ కూడదు అనుకుంటే కనుక తాను ఫస్ట్ టైం అంటే 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన చోడవరం సీటుని ఆశిస్తున్నారు. అక్కడ కూడా గంటాకు తగినంత బలం ఉంది. అనుచరులు మెండుగా నిండుగా ఉన్నారు. అదీ కాకపోతే 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి గెలిచిన అనకాపల్లి సీటుని కూడా ఆయన ఆశిస్తున్నారు. ఇక చివరిగా గాజువాక మీద కూడా గంటా కన్ను ఉంది అంటున్నారు.
ఈ నాలుగు సీట్లలో మూడింటిలో గంటా గతంలో పోటీ చేసి గెలిచినవే కావడం విశేషం. ఇక గాజువాక గంటాకు కొత్త సీటు అవుతుంది. అయితే ఈ నాలుగింటికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదే కాపు ఓట్లు అత్యధికంగా ఉన్న సీట్లు ఇవి. పైగా గంటా వంటి బిగ్ షాట్ ఇక్కడ పోటీకి దిగితే గన్ షాట్ గా గెలవడం ఖాయం. అందుకే గంటా అన్ని లెక్కలూ వేసుకుని ఈ ఆప్షన్లు తెలుగుదేశం అధినాయకత్వం ముందు ఉంచారని అంటున్నారు.
ఇక ఆయన విశాఖ నార్త్ కి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన గత నాలుగేళ్లుగా నియోజకవర్గం ముఖమే చూడలేదు అన్న విమర్శలు ఉన్నాయి. మరోసారి అక్కడ సీటుని ఆయన కోరుకోవడం లేదు, అధినాయకత్వం ఇచ్చినా గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో అన్న డౌట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే గంటా సిట్టింగ్ సీటు నార్త్ తో సహా మిగిలిన నాలుగింటిలోనూ జనసేన జెండా పాతేసినట్లుగా చెబుతున్నారు. ఈ అయిదు సీట్లూ తమకే ఇవ్వాలని తెలుగుదేశంతో బేరాలు పెడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
అంటే ఈ సీట్ల విషయంలో తెలుగుదేశం కనుక వదులుకుంటే గంటాకు సీటు అన్నదే లేకుండా పోతుంది. దాంతో ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసేందుకు అవకాశాలు ఉండవని అంటున్నారు. ఇక గంటా సొంత జిల్లా ప్రకాశం. దాంతో విశాఖలో తెలుగుదేశం జనసేన పొత్తు హౌస్ ఫుల్ బోర్డు పెడితే ఆయన ప్రకాశం జిల్లాకు షిఫ్ట్ అవుతారా అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా గంటా రాజకీయం ఇపుడు అయోమయంలో పడింది అని అంటున్నారు. మరి ఈ పొత్తుల ఎత్తులలో సీనియర్ నేతకే టికెట్ లేని సీన్ ఉంటే మిగిలిన ఆశావహుల పరిస్థితి ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే గంటాకు తెలుగుదేశం లో చాన్స్ లేకపోతే జనసేనలోకి వెళ్ళి పోటీ చేస్తారా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ఇప్పటికైతే సస్పెన్స్ లోనే ఉంది అంటున్నారు. రీసెంట్ గా చినబాబు నారా లోకేష్ ని కలసి వచ్చిన గంటాకు ఏ రకమైన భరోసా లభించింది అన్నది తెలియడంలేదు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.