ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు విఫలమయ్యాయని బీజేపీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. అంతేకాదు.. ఏపీకి అన్యాయం చేసిన తెలంగాణను ప్రశ్నించలేక పోతున్నారని దుయ్యబట్టారు. అయితే.. దీనిపై నెటిజన్లు ఓ ఆట ఆడేసుకున్నారు. ``వారు విఫలమయ్యారా? సఫలమయ్యారా? పక్కన పెట్టండి.. ఏపీలో అధికారంలోకి వస్తున్నాం.. వచ్చే స్తున్నాం.. అని పదే పదే చెబుతున్నారు కదా.. మరి మీరు తెలంగాణను ఎప్పుడైనా.. ఎక్కడైనా.. నిలదీశారా?`` అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. జల వివాదాలపై ఒక్క మాటైనా.. ఇప్పటి వరకు నోరు విప్పారా? అని నిలదీస్తున్నారు.
ఏపీకి వైసీపీ ఏమీ చేయలేదు.. టీడీపీ ఏమీ చేయలేదు.. అని అంటున్న జీవీఎల్.. ప్రస్తుతం ఎంపీగా ఉండి.. కేంద్రం నుంచి ఒక్కటంటే.. ఒక్క ప్రాజెక్టును తీసుకువచ్చారా? కనీసం.. పోలవరం నిధులు కానీ.. వెనుక బడిన జిల్లాలకు అభివృద్ది నిధులు కానీ.. తెచ్చారా? ఇక, మూడు రాజధానులకు వ్యతిరేకం అంటూనే కర్నూలులో హైకోర్టు కావాలని.. వైసీపీ పాట పాడుతుండ డాన్ని ఏమనాలి? అనేది నెటిజన్ల మాట. పొరుగున ఉన్న తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని చెబుతున్నారు.
మరి ఇలా అధికారంలోకి వస్తే.. అప్పుడైనా..ఏపీతో నెలకొన్న జల వివాదాలకు.. ఫుల్ స్టాప్ పెడతామని హామీ ఇస్తారా? అంటే.. అది కూడా లేదు. మరి కేంద్రంలో అధికారంలో ఉండి కూడా.. ఏమీ చేయలేని.. వారు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని అడిగే అధికారం.. విమర్శించే అధికారం ఉంటాయా? అనే దానికి సహాధానం చెప్పాలని.. నెటిజన్లు నిలదీస్తున్నారు. కేవలం మైకు దొరికిందని.. ఏదో మాట్లాడేయాలని.. ప్రజలు వింటారులే అని మాట్లాడితే.. కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమని కూడా.. నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
ఇంతకీ జీవీఎల్ ఏమన్నారంటే..
తాజాగా మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో విఫలమైంద న్నారు. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ చేసిన అన్యాయంపై మాట్లాడే దమ్ము జగన్, చంద్రబాబుకు లేదన్నారు. ఏపీ బకాయిలు చెల్లించని టీఆర్ఎస్ ఆంధ్రలో ఎలా అడుగుపెడుతుందని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌కు టీడీపీ, వైసీపీలతో ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలన్నారు. ఉమ్మడి అధికార చట్టాన్ని హైదరాబాద్‌పై, అధికారం ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు.
జగన్ సెక్రటేరియట్‌ను తెలంగాణ ప్రభుత్వానికి ఎలా ఇచ్చారని జీవీఎల్ ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధిలో వైసీపీ పాత్ర వినాశనానికేనన్నారు. రాజధానిపై ప్రకటన అనేది.. రాజధాని పేరుతో రాజకీయం తప్పితే మరి ఏం లేదన్నారు. వైసీపీ, టీడీపీలు ఈ విషయంలో మైండ్ గేమ్ ఆడుతున్నాయని జీవీఎల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైనే నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ముందు ఏపీకి మీరేం చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు. మరి దీనిపై జీవీఎల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.