ఇంత‌కీ ప‌వ‌న్ చెప్పిందేంటి.. జ‌నాల‌కు అర్ధ‌మైందేంటి..?

Update: 2023-01-14 09:30 GMT
ఏదైనా.. రాజ‌కీయ  నేత‌.. ఒక ప్ర‌సంగం చేస్తే.. దాని తాలూకు ఎసెన్స్ ప్ర‌జ‌ల్లోకి సిలైన్ మాదిరిగా ఎక్కిపోవాలి. ఇది.. గ‌తంలో క‌మ్యూనిస్టు యోధులు చేసి చూపించారు. వారు చెప్పాల‌ని అనుకున్న విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డేవారు కాదు. చెప్పాల‌ని అనుకున్న అంశాన్ని సూటిగా సుత్తిలేకుండా.. నిర్మొహ‌మాటంగా చెప్పేసి.. ప్ర‌జ‌ల‌ను ఆలోచ‌న దిశ‌గా న‌డిపించారు. మ‌రి వారి పుస్త‌కాల‌ను ప‌దే ప‌దే చ‌దివాన‌ని చెప్పే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏం చేస్తున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. ఆయ‌న చేస్తున్న ప్ర‌సంగాల్లో రానురాను ప‌స త‌గ్గిపోతోంద‌ని అంటున్నారు పరిశీల‌కులు.ఒక ప్పుడు ప‌వ‌న్ ప్ర‌సంగం అంటే.. బాగానే విశ్లేష‌ణ‌లు వ‌చ్చేవి. కానీ, ఇప్పుడు పాజిటివ్ విశ్లేష‌ణ చేసేందుకు వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీనికి కార‌ణం.. తాజాగా చేసిన ప్ర‌సంగంలో ఆయ‌న ఏం చెప్ప‌ద‌లు చుకున్నారు?  ఏం చెప్పారు? అనేది ప్ర‌జ‌ల మ‌ధ్య‌ చ‌ర్చ‌గా మిగిలిపోవ‌డ‌మే.  

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీరు నావెంట నిల‌వండి..అన్నారు. దీనిని బ‌లంగా చెప్పారా?  అంటే లేదు. నిల‌వ‌క‌పోతే.. మీరే న‌ష్ట‌పోతారు..  అప్పుడు నాద‌గ్గ‌ర‌కు రావొద్దు.. న‌న్ను పిలిచినా.. నేను ప‌ల‌క‌ను అన్నారు. ఉత్త‌మ రాజ‌కీయ నాయ‌కుడి ల‌క్ష‌ణం.. ఇది కానేకాదు. ప్ర‌జ‌లు గెలిపిస్తే వుంటా.. గెలిపించి తీరాల‌ని అనుకునే ప‌రిస్థితి ఇస్తే.. ప్ర‌జ‌లు విముఖ‌త వ్య‌క్తం చేస్తారు. దీనిని ప్ర‌జ‌లు ఎలా తీసుకుంటారో చూడాలి.

పొత్తులు పెట్టుకుంటాను.. త‌ప్పేంటి? అని నిల‌దీసి అనుంటే.. పార్టీపై సానుకూల ప‌వ‌నాలు జోరుగా వీచేవి. అయితే.. పొత్తుల‌పైనా.. త‌ట‌ప‌టాయింపు దోర‌ణిలోనే మాట్లాడారు. మీరు అండ‌గా ఉంటే.. పొత్తుపెట్టుకోను.. అన్నారు. అంటే.. దేశంలో ప్ర‌జ‌ల నాడి చూసుకుని పొత్తు పెట్టుకుంటారా?  లేక రాజకీయ వాతావ‌ర‌ణాన్ని చూసి పొత్తులు కోరుకుంటారా? అనేది ప‌వ‌న్ క్లారిటీ ఇవ్వ‌లేక పోయారు. ఇక‌, ప్ర‌భుత్వంపై పోరాడండి.. అనే డైలాగును చాలా సార్లు అన్నారు.

ఈ పోరాటంలో ఇప్ప‌టికే అనేక మంది కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌లేదు.ఇక‌, జ‌గ‌న్ ఇచ్చే ప‌థ‌కాల‌ను నేను కూడా ఇస్తాన‌న్నారు. దీంతో అంద‌రూ గుండె నిండా గాలి పీల్చుకున్నారు. కానీ, ఆ వెంట‌నే అమ్మ ఒడి, వాహ‌న మిత్ర లెక్క‌లు  చెప్పి.. నేను అభివృద్ధి చేస్తా.. అని ముక్తాయించారు. ఆ వెంట‌నే జ‌నాలు నిట్టూర్చారు.  మొత్తంగా చూస్తే..ప‌వన్ ఏం చెప్పాల‌ని అనుకున్నారో.. ఏం చెప్పారో.. ఆయ‌న‌కైనా అర్ధ‌మైందా? అనేది స‌గ‌టు నిఖార్స‌యిన‌(ఆది మాట‌లో) అభిమాని మాట‌!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News