అయ్యన్న గ్రాఫ్ పెరిగింది...పెట్లకు డౌటేనా...?

Update: 2022-12-18 02:30 GMT
మొత్తానికి చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా ఉన్న నర్శీపట్నంలో టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగింది అంటున్నారు. వైసీపీ అంతర్గత సర్వేలు కూడా ఆ విషయం స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ప్రఖ్యాత డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తమ్ముడు అయిన పెట్ల ఉమాశంకర్ గణేష్ కి కొంత ఇబ్బంది ఉందని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన ఫస్ట్ టైం అయ్యన్న మీద వైసీపీ టికెట్ తో పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడారు.

అయిదేళ్ల పాటు పట్టుదలగా పనిచేసి 2019 ఎన్నికల్లో పాతిక వేల భారే ఓట్ల తేడాతో దిగ్గజ నేత. నాటి మంత్రి అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఓడించారు. అయ్యన్న రాజకీయ జీవితంలో మూడు సార్లు ఓడారు. అయితే రెండు సార్లు అతి తక్కువ తేడాతో అది జరిగింది. కానీ 2019లో మాత్రం భారీ తేడాతో ఓటమిని అందుకున్నారు. నిజానికి అయ్యన్న వయసు రిత్యా వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ దూకుడు రిత్యా చూస్తే సీనియర్ నేత రాజకీయ జీవితం ముగిసినట్లే అని అంతా అనుకున్నారు.

కానీ గిర్రున మూడేళ్ళు తిరగకుండానే ఇపుడు నర్శీపట్నంలో సీన్ మారుతోంది అని అంటున్నారు. అయ్యన్నపాత్రుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే మంచి ఆధిక్యతతో నెగ్గడం ఖాయమని అంటున్నారు. తాజాగా ఆయన ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ తన నియోజకవర్గంలో మొదలెట్టిన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. అయ్యన్నకు మంగళహారతులతో నీరాజనాలు పట్టారు.

నిజానికి అయ్యన్న మూడేళ్ళుగా వైసీపీ పాలన మీద పోరాడుతున్నారు. ఆయనను వైసీపీ ప్రభుత్వం కార్నర్ చేసింది. ఆయన్ని అరెస్ట్ చేయాలని చాలా సార్లు చూసింది. లేటెస్త్ గా  ఈ మధ్య మరోమారు అరెస్ట్ చేయాలనుకున్నా ఆయనకు బెయిల్ లభించింది. ఇలా అయ్యన్నను టార్గెట్ చేయడం వల్లనే ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది అని ఒక విశ్లేషణ ఉంది. ఏడు పదుల వయసులో ఉన్న అయ్యన్నను పోలీసులు గేట్లు దాటుకుని వచ్చి మరీ రాత్రి పగలూ చూడకుండా అరెస్ట్ చేయడంతో సింపతీ పెరిగింది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే పెట్ల ఉమా శంకర్ కూడా వైసీపీలో అందరికీ కలుపుకుని పోవడంలేదని అంటున్నారు. ఆయన తన గెలుపుకుని పూర్తిగా సొంత ఖాతాలో వేసుకోవడం వల్ల కూడా నాయకులు ఎడం పాటిస్తున్నారు అని అంటున్నారు. ఇక ఏపీలో చంద్రబాబు తరువాత వైసీపీ మీద ఎక్కువగా మాట్లాడి సర్కార్ ని నియత్రించే అయ్యన్న విషయంలో పెట్ల ఉమా శంకర్ వ్యూహాలు కూడా సరిపోవడంలేదు అని అంటున్నారు.

సీనియర్ నాయకుడు బిగ్ షాట్ గా అయ్యన్న ఉండడంతో జనం మొగ్గు ఆయన వైపు కనిపిస్తోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో చూస్తే పెట్ల పనితీరు మీద వైసీపీ సర్వేలలో కూడా తేడా కొట్టింది అని అంటున్నారు. మరో మూడు నెలలలోగా ఆయన తన ను తాను రుజువు చేసుకోకపోతే కొత్త వారికి టికెట్ అని అంటున్నారు. బహుశా అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వవచ్చు అని అంటున్నారు. అపుడు అన్నదమ్ముల మధ్య పోరు రంజుగా సాగుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా పెట్లకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయా అంటే ఆలోచించాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News