మనొడా..పొరుగోడా కాదు... పార్టీని నడిపించే సత్తా ఉందా... టీ కాంగ్రెస్‌లో లుకలుక...!
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే.. కాంగ్రెస్‌లో నేతల పరిస్థితి చిత్రంగా ఉంటుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తారు నాయకులు. ఎవరికి వారికి పదవులు కావాలి. ఎవరికి వారికి అధికారం.. పెత్తనం కావాలి. ఇది కనుక దక్కక పోతే.. ఇక, పార్టీ పని అయిపోయిందంటూ.. నాయకులు రోడ్డెక్కుతారు. గగ్గోలు పెడతారు. దీనికి కారణం.. తమకు దక్కాల్సిన పదవులు ఎవరో కొట్టుకు పోయారని.. తమకు దక్కకుండా చేశారనే అక్కసే..!
అయితే.. వాస్తవంలోకి వస్తే.. ఇప్పటికే పదవుల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు.. లేదా కురువృద్ధ నాయకులు.. కాంగ్రెస్‌ను ఏం ఉద్ధరిస్తున్నారనేది ప్రధానంగా తెరమీదకి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే..ఎవరో వచ్చి తమ నోటి కాడ కూడు లాగేశారని భావిస్తున్నవారు.. దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇదే ప్రశ్న ఉదయిస్తోంది. అక్కడ పార్టీ చీఫ్‌గా రేవంత్‌ను నియమించారు. ఇది అధిష్టానం నిర్ణయం. అయితే..ఆయన టీడీపీ నుంచి వచ్చారని.. తమకు దక్కాల్సిన చీఫ్ పదవిని ఆయన ఎత్తుకుపోయారని.. సీనియర్లు గుస్సాగా ఉన్నారు.
ఇలాంటి వారిలో జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2014లో రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించిన తర్వాత.. పొన్నాల లక్ష్మయ్య పార్టీ చీఫ్ గాఉన్నారు. మరి ఆయన నేతృత్వంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారా? అంటే.. శూన్యం. ఇక, ఆత తర్వా.త. గత ఎన్నికలకు ముందు.. పార్టీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడి కన్నా ఘోరంగా వ్యవహరించారనే వాదన ఎలానూ ఉంది.
ఉత్తమ్ హయాంలోనే ఏకంగా 11 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టారు. కనీసం ... పది మంది కొత్తవారిని కూడా పార్టీలో చేర్చుకోలేక పోయారు. బలంగా కేసీఆర్‌పైనా యుద్ధం ప్రకటించలేక పోయారు. అంటే.. సంస్థాగతంగా.. పార్టీకి పునాదులు పడినప్పటి నుంచి పనిచేస్తున్నామని.. జెండా మోస్తున్నామని .. చెబుతున్న నాయకుల వల్ల పార్టీకి ఒరిగింది ఏంటి? అనేది కీలక ప్రశ్న.
ఇక, రేవంత్ విషయాన్ని తీసుకుంటే.. ఆయన గతంలో ఏ పార్టీలో ఉన్నారనేది పక్కన పెడితే.. పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు.. ప్రతి ఒక్కరినీ బుజ్జగించి.. పార్టీలో కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని.. ధీమా గా చెబుతున్నారు. మరి ఇలాంటి నేత అవసరమా?. లేక పాత వాసనలతో కాలం గడిపే కురువృద్ధులు.. అవసరమా? అనేది ఇప్పుడు తేల్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.