టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు పదే పదే టార్గెట్ అవుతున్నారు? ఇదీ... ఇప్పుడు టీడీపీలోనే జరు గుతున్న చర్చ. టార్గెట్ అంటే.. ఇక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ కాదు. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలే టార్గెట్‌గా మారుతున్నాయి. ఎందుకంటే..పార్టీలో భరోసా నింపాల్సిన నాయకుడు.. చంద్రబాబు. ఆయన తర్వాత ఇంకెవరూ లేరు. మరి అలాంటి నాయకుడేబేలగా మారిపోయి.. ఒక్క ఛాన్స్ అంటూ.. లాస్ట్ ఛాన్స్ అంటూ.. అర్థించడం.. సరికాదనేది సీనియర్ల మాట.
నిజానికి.. చంద్రబాబుపై ఉన్న ఇమేజ్ వేరు. ఆయనను ప్రజలు విజన్ ఉన్ననాయకుడిగానే చూస్తున్నారు. సో.. దీనిని అడ్డు పెట్టుకుని, అభివృద్ధి పేరుతో ముందుకు సాగకుండా.. ఇలా బేలగా మారడం వల్ల.. వైసీపీకి మరిన్ని ఆయుధాలు ఇచ్చినట్టే అవుతుందని అంటున్నారు. పైగా.. సానుభూతి.. చంద్రబాబు కోరుకున్నా.. చంద్రబాబును ఈ కోణంలో చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. గత ఎన్నికల్లో ఆయన వంగి వంగి దణ్ణాలు పెట్టారు. తనను మరోసారి గెలిపించాలన్నారు. వర్కవుట్ కాలేదు.
ఇక, ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. అంటే.. ఇది వర్కవుట్ అవుతుందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చేస్తుందనే భయం చంద్రబాబును వెంటాడుతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. ఒకవైపు.. వైసీపీ అరాచక ప్రభుత్వం అంటున్నారు. మరోవైపు.. మాత్రం.. ఇలా బేలగా అర్ధిస్తున్నారు. ఇవి రెండు కూడా వర్కవుట్ అయ్యే అవకాశం ఉందా? లేదా? అనేది తమ్ముళ్ల మాట.
ఎందుకంటే.. నిజంగానే వైసీపీ బలంగా లేదని భావిస్తే.. చంద్రబాబు ఇలా.. లాస్ట్ ఛాన్స్ అంటూ.. చెప్పా ల్సిన అవసరం లేదు. కానీ, వైసీపీకి ఇప్పటికి ప్రజల్లో 51 శాతం మద్దతు ఉంది. ముఖ్యంగా మహిళలు.. వైసీపీవైపే ఉన్నారు.
చిన్న చితకా విషయాలు పక్కన పెడితే.. మళ్లీ వైసీపీ వచ్చేసే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. అమలు చేస్తున్న పథకాలు.. సంక్షేమం బాగానే వర్కవుట్ అవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారనే వాదన వినిపిస్తోంది. మరి, ఇక పోరాటాలు ఎందుకు.. ఉద్యమాలు ఎందుకు? అని అనంతపురానికి చెందిన ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.