శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో కింజరాపు ఫ్యామిలీని విడదీసి చూడడం బహు కష్టం. నాలుగు దశాబ్దాలు పైగా రాజకీయం వారిది. అధికారం ఉన్నా లేకపోయినా జిల్లాను శాసిస్తున్నారు. ఇక ఎర్రన్నాయుడు మరణాంతరం ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు యువ కెరటంలా దూసుకు వచ్చారు. రెండు సార్లు ఎంపీగా గెలిచి సత్తా చాటారు. అటు ఢిల్లీలో కూడా బలంగా వాణిని వినిపిస్తూ వస్తున్నారు.
అధినాయకుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆయన మాట బాబు కాదనే పరిస్థితి అయితే లేదు. దాంతో రామ్మోహన్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి దిగాలని చూస్తున్నాట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ధర్మాన బ్రదర్స్ సొంత ఇలాకా అయిన నరసన్నపేటను ఎంచుకున్నారు.
అక్కడ ఈసారి వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలు చెబుతున్న నేపధ్యంలో రామ్మోహన్ లాంటి యువ నేత బరిలోకి దిగితే సైకిల్ పరుగులు తీయడం ఖాయం.
పైగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బగ్గు లక్ష్మణ రావు, రమణమూర్తిల మద్దతు కూడా రామ్మోహన్ కి ఉంది. ఎంపీగా గెలిచినా ఢిలీలో పెద్దగా తెలుగుదేశం తరఫున చేసేది లేదని, ఆ పార్టీ జాతీయ స్థాయిలో కూడా ఇపుడు అంతలా వెలిగేదీ లేదని అంచనాకు వచ్చిన వారంతా రామ్మోహన్ అసెంబ్లీలో ఉంటేనే బెటర్ అంటున్నారుట.
వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే రామ్మోహన్ కచ్చితంగా మంత్రి అవుతారని, అవాలని కోరుకుంటున్నారు. అయితే బాబాయ్ అచ్చెన్నాయుడు సంగతేంటి అన్న చర్చ ఇక్కడ వస్తోంది. ఆయన 2014 నుంచి 2019 దాకా మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. మరో సారి పార్టీ పవర్ లోకి వస్తే హోం మంత్రి కూడా కావాలని ఆశలు పెంచుకుంటున్న బాబాయ్ కి రామ్మోహన్ అసెంబ్లీ చూపు బ్రేక్ వేసేలా ఉంది అంటున్నారు.
ఇక చంద్రబాబు సైతం రామ్మోహన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. అంటే వచ్చే ఎన్నికల్లో బాబాయ్ అబ్బాయ్ ఇద్దరూ అసెంబ్లీకి పోటీ చేస్తారన్న మాట. మంత్రి పదవి మాత్రం యువకుడు అయిన రామ్మోహన్ కి దక్కితే మరి బాబాయ్ జస్ట్ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సిందేనా అన్న చర్చ కూడా పార్టీలో వస్తోంది. ఒక విధంగా ఇప్పటిదాకా కింజరాపు ఫ్యామిలీలో ఏ రకమైన విభేధాలు లేవు. రామ్మోహన్ కనుక అసెంబ్లీకి పోటీ చేస్తే మాత్రం ఈ ఫ్యామిలీలోకి కూడా రాజకీయ పోరు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.