చారిత్రక సెప్టెంబర్ 17 సందర్భంగా గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను సీఎం కేసీఆర్ ప్రజలకు అంకితం చేశారు. బంజారాహిల్స్‌లో సకలహంగులతో నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కుమురంభీం ఆదివా సీ భవన్‌లను ముఖ్యమంత్రి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. గిరిజనుల, ఆదివాసీలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడతాయన్న సీఎం రాష్ట్రప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగిడిన సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ హైదరాబాద్ బంజారాహి ల్స్‌లో బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించారు. సంత్ సేవాలాల్, కుమురంభీం భవనాలను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి గిరిజన, ఆదివాసీ బిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు.
21 కోట్ల 71 లక్షలతో బంజారాలకు సంతు సేవాలాల్ భవనాన్ని, 21 కోట్ల 50 లక్షలతో ఆదివాసీలకు కుమురంభీం భవన్‌ని అన్ని సౌకర్యాలతో నిర్మించారు. రెండు భవనాలను కలియతిరిగిన ముఖ్యమంత్రి కమ్యూనిటీ హాళ్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఆదివాసీ, గిరిజన బిడ్డలు ఈ భవనాల వేదికగా మరింత ప్రగతిబాటలో నడవాలని ఆకాంక్షించారు.
బంజారా, ఆదివాసీ బిడ్డలు తలెత్తుకునేలా భవనాలు నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివాసీ, బంజారా హక్కుల పరిరక్షణ వేదికలుగా ఉండాలని భావించారు. ఈ భవనాల వేదికగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని బంజారాలు, ఆదివాసీలకు కేసీఆర్ భరోసానిచ్చారు.
"హైదరాబాద్‌లో బంజారాహిల్స్ అనే పెద్ద ప్రాంతం ఉంది కానీ అక్కడ బంజారాలకు చోటు లేదు. మహారాష్ట్రలో బంజారాలు బీసీల జాబితాలో ఉన్నారు. దేశవ్యాప్త బంజారాలకు ఒకే స్థాయి రిజర్వేషన్లు ఉండాలి. టీఆర్ ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక ఏకీకృత విధానం తెస్తాం. త్వరలో పోడుభూముల సమస్య పరిష్కరించనున్నాం. ఉన్నత స్థానాల్లో ఉన్న గిరిజనులు తండాల్లో సమస్యల పరిష్కరానికి కృషి చేయాలి. బంజారా, ఆదివాసీలు తలెత్తుకునేలా భవనాలు నిర్మించాం. బంజారాలకు ఏ కష్టమొచ్చినా ఈ భవనం నుంచి ఆదుకోవాలి. ఆదివాసీ, బంజారా హక్కుల పరిరక్షణ వేదికలుగా ఉండాలి." అని సీఎం కేసీఆర్ అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.