వైసీపీలో పైకి కనిపించే ప్రశాంతత అంతా వట్టి మాటేనా అంటే జవాబు అవును అనే చెప్పాలేమో. ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నా కూడా సరైన సమయంలో అసమ్మతి కెరటాలు ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకరొకరుగా ఇపుడు మెల్లగా గొంతు సవరిస్తున్నారు. వారిని చూసి మిగిలిన వారు కూడా అదే బాటన నడిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
వైసీపీ అంటే తమ సొంత పార్టీ అని జగన్ అంటే తమ గుండె చప్పుడు అని చెప్పే కీలక నాయకులే ఇపుడు రివర్స్ అవడం వైసీపీలో అలజడినే రేపుతోంది. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి జగన్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలు. ఆమె లేటెస్ట్ గా మాట్లాడుతూ వైసీపీ అనే చెట్టు నీడన తాము పెరిగామని, అటువంటి చెట్టు కొమ్మలను నరికేయాలనుకుంటే పార్టీయే మిగలదు అని జోస్యం చెప్పడం వెనక ఉద్దేశ్యాలు ఏంటి అన్న చర్చ సాగుతోంది.
జగన్ కి చెల్లెలు అనిపించుకున్న మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా కారాలు మిరియాలూ నూరుతున్నారు. ఆమె తన భర్త ఎటు నడిస్తే తాను అటే అంటూ లేటెస్ట్ గా వైసీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆమె భర్త టీడీపీతో సన్నిహితంగా ఉంటున్నారు అని ప్రచారంలో ఉంది. ఆయన ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు. అంటే సుచరిత ఫ్యాన్ నీడ నుంచి జరిగి సైకిలెక్కే రోజులు దగ్గరలో ఉన్నాయని అంటున్నారు.
ఇక నెల్లూరు పెద్దాయన ఆనం రామనారాయణరెడ్డి గురించి వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన జగన్ తీరుని కొంతకాలంగా తప్పుపడుతున్నారు. అది ఇపుడు మరింత పీక్స్ కి చేరి బాహాటం అయింది. దాంతో ఆయన ప్లేస్ లో వెంకటగిరి నియోజకవర్గానికి ఇంచార్జిగా నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని జగన్ నియమించారు. ఆనం రెబెల్ గా మారారు అని అనుకుంటే అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు.
ఆయనకు మంత్రి పదవి పోయింది. సొంత పార్టీలో ఇబ్బందులు ఉన్నాయి. అధినాయకత్వం పట్టించుకోవడంలేదు. టికెట్ మీద కచ్చితమైన హామీ కూడాలేదు, దాంతో ఆయన కూడా ఏదో ఒక రోజున బరస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని జగన్ పిలిపించుకుని మాట్లాడాక కొంత తగ్గినా మిగిలిన వారు ఎలా రియాక్ట్ అవుతారో, ఎపుడు ఎలా ఉంటారో తెలియదు అంటున్నారు
పైకి ఇలా కొన్ని పేర్లు కనిపిస్తున్నా కూడా చాలా మంది వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ప్రతీ జిల్లాలో చూసుకుంటే అసమ్మతి గొంతుకలు పెద్ద ఎత్తున వినిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దీనికి కొంత సమయం పట్టినా వైసీపీలో అసమ్మతి మాత్రం వెల్లువలా వెల్లువలా ఉందని అంటున్నారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీలోని అసమ్మతి స్వరాన్ని తగ్గించుకోవాలి. అలాగే బయట ప్రత్యర్ధులతో కూడా పోరాడాల్సి ఉంది. వచ్చే ఎన్నికలు హోరాహోరీ అని అంతా అంటున్న వేళ వైసీపీకి ఇపుడు ఇంటా బయటా పెను సవాళ్ళే ఎదురు అవుతున్నాయని అంటున్నారు. మరి దాన్ని ఎలా నెట్టుకువస్తారో చూడాలని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.