ఆ ఎంపీ ప‌రిస్థితి.. ఆట‌లో అర‌టి పండేనా..?

Update: 2022-07-07 02:56 GMT
చేసుకున్న‌వారికి చేసుకున్నంత ఫ‌లితం వ‌స్తుంద‌ని పెద్ద‌లు అంటారు. ఇప్పుడు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ర‌ఘురామ రాజు.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. న‌ర‌సాపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ న‌కు త‌లెత్తిన ఆధిప‌త్య పోరాటం.. త‌ద‌నంత‌రం.. త‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే.. ఆయ‌న‌పై తిరుగుబాటు చేయ‌డం.. వీరికి పార్టీ అధిష్టానం కూడా అండ‌గా ఉండ‌డం.. ప్ర‌ధాన వివాదం.

దీనికి తోడు.. స్థానికంగా జ‌రుగుతున్న దందాల్లో.. త‌న వాటా త‌న‌కు ఇవ్వ‌డం లేద‌నే వాద‌న కూడా ర‌ఘురామ‌కు ఉంద‌నేది స్థానికంగా జ‌రుగుతున్న మ‌రో ప్ర‌చారం.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే వైసీపీ అధిష్టానా నికి.. ర‌ఘురామ‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఇదిలావుంటే.. తాజాగా జ‌రిగిన‌ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ర‌ఘురామ‌పై కేసులు పెరిగాయి. ఆయ‌న కుటుంబంపైనా.. వ్య‌క్తిగ‌త సిబ్బందిపైనా కేసులు న‌మోదయ్యా యి.అంతేకాదు.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాసుకునే వ‌రకు ప‌రిస్థితి వ‌చ్చింది.

దీనిని బ‌ట్టి.. ర‌ఘురామ విష‌యం అంతా.. కూడా ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుంద‌నే వాద‌న వినిపిస్తుండ డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ఘురామ దైర్యం అంతా కూడా కేంద్రంపైనా.. బీజేపీపైనా ఉంది. ఏం జ‌రిగినా.. త‌న‌కు ర‌క్ష‌ణ‌గా ఉంటార‌ని.. త‌నను ఆదుకుంటార‌ని.. ఆయ‌న న‌మ్మార‌నే ప్ర‌చారం కూడా ఉంది.

ఇక‌, బీజేపీలో ఆయ‌న చేరిక ఖాయ‌మ‌ని కొన్నాళ్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే.. అనూహ్యంగా ర‌ఘురామ ఇప్ప‌టి వ‌ర‌కు న‌మ్ముకున్న వారే.. ఆయ‌న‌ను వ‌దిలేశార‌ని ఆయ‌న ఆవే ద‌న వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అంటే.. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి ఆట‌లో అర‌టి పండు మాదిరిగా ఉంద‌ని అంటున్నారు. ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి కూడా రాలేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని.. క‌నీసం నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌ల‌క‌రించిన కేంద్ర మంత్రులు సైతం ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. పార్ల‌మెంటు స్పీక‌ర్‌కు సైతం ఫిర్యాదు చేసు కునే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప‌రిస్థితి అగ మ్య గోచ‌రంగా ఉంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న‌ను ఏ పార్టీ కూడా ప‌ట్టించుకునే ప‌రి స్థితి లేద‌ని టాక్ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News