వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ సాయిరెడ్డి దూకుడు పెరిగిందా?

Update: 2022-07-14 00:30 GMT
వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ సాయిరెడ్డి దూకుడు పెరిగిందా?  నిన్న మొన్న‌టి వ‌ర‌కు విశాఖ‌కు ప‌రిమిత మైన ఆయ‌న‌.. ఇప్పుడు ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోనే తిష్ట‌వేశారా? అంటే.. ఔన‌నే అంటున్నాయి వైసీ పీ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం సీఎంవోలో.. కీల‌క నాయ‌కుడిగా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఉన్నారు. అంతా కూ డా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతున్నాయి. ఇటు ప్ర‌భుత్వ ప‌రంగా.. అటు రాజ‌కీయంగా కూడా అన్నీ స‌జ్జ‌లే చ‌క్రం తిప్పుతున్నారు. అయితే.. ఆయ‌న‌కు ఇప్పుడు చెక్ ప‌డుతోంద‌ని వైసీపీలో గుస‌గుస వినిపిస్తోంది.

మ‌రోవైపు ప్ర‌భుత్వం-ఉద్యోగ వ‌ర్గాల మ‌ధ్య ఏర్ప‌డిన వివాదంలోనూ ఆయ‌నే కీల‌కంగా మారి చ‌ర్చ‌లు జ‌రిపి న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు పార్టీలో ఏర్ప‌డుతున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలోనూ.. స‌జ్జ‌ల ముందున్నారు.

ఇక‌, అధికారికంగా.. ఇటు రాజ‌కీయంగా ఆయ‌న‌పై అనేక విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. స‌క‌ల శాఖా మంత్రి అంటూ.. ఆయ‌నపై సొంత పార్టీ నాయ‌కులే విమ‌ర్శ‌లు చేసిన ప‌రిస్థితి కూడా ఉంది. అయితే.. ఇప్పు  డు.. ఆయ‌న ప్లేస్‌ను సాయిరెడ్డి ఆక్ర‌మించేశారా? అనేది వైసీపీ నేత‌ల్లో జ‌రుగుతున్న ప్ర‌ధాన చ‌ర్చ‌.

తాజాగా జ‌రిగిన ప్లీన‌రీలో సాయిరెడ్డి స‌ర్వంగా క‌నిపించారు. తీర్మానాలు ప్ర‌వేశ పెట్ట‌డం నుంచి ఆమోదిం చే వ‌ర‌కు అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌ను వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించ‌డంలో నూ.. దీనికి సంబంధించి ఏర్ప‌డిన క‌మిటీల్లోనూ.. స‌జ్జ‌ల‌కు ప్రాధాన్యం లేదని వైసీపీలోనే ప్లీన‌రీ వేదిక‌గా గుస గుస వినిపించింది. తాజాగా ఉద్యోగుల బ‌దిలీ వ్య‌వ‌హారంలోనూ.. సాయిరెడ్డి చ‌క్రం తిప్పుతున్న‌ట్టు సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదే విష‌యంపై వైసీపీలోనూ.. చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు.. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన‌.. స‌జ్జ‌ల‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే ప‌క్క‌న పెడుతున్నారా?  లేక ఏం జ‌రుగుతోంద‌న్న‌ది.. వైసీపీలో హాట్ టాపిక్‌గా మారిం ది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు విశాఖ‌లో చ‌క్రం తిప్పిన సాయిరెడ్డి .. అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు.

ప్ర‌తి విష యంలోనూ త‌నే చూసుకున్నారు. దీంతో ఏకంగా అప్ప‌టి మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ఆయ‌న‌కు మ‌ధ్య గ్యాప్ కూడా వ‌చ్చింద‌ని అన్నారు. ఇక‌, ఇప్పుడు అక్క‌డ నుంచి త‌ప్పించిన త‌ర్వాత‌.. ఆయ‌న సీఎంవో ప‌డ్డార‌ని వైసీపీ నాయ‌కులు బాహాటంగానే చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News