తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు తప్పవా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవును అనే జవాబు వస్తోంది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీయార్ మీడియా సమావేశం పెట్టి మరీ ముందస్తునకు మేము రెడీ అన్నారు. విపక్షాలు టైమ్ డేట్ ముహూర్తం ఫిక్స్ చేయమన్నారు. ఉంటే గింటే మీకే ఎన్నికల భయాలు ఉండాలి కానీ మాకేంటి అన్న ధోరణిలో ఆయన చాలెంజ్ చేశారు అనుకోవాలి. మరి కేసీయార్ అలా ప్రకటించగానే ఇప్పుడే పెట్టండి మేము రెడీ అని కాంగ్రెస్ బిగ్ సౌండ్ చేసింది.
బీజేపీ కూడా మేము రెడీ అంటోంది కానీ తెలంగాణాలో ఉన్న రాజకీయ వాతావరణం చూస్తే ముందస్తునకు ఆ పార్టీ సిద్ధంగా ఉందా అన్న సందేహాలు రాక మానవు. బీజేపీ విషయానికి వస్తే వచ్చే ఏడాది ఎన్నికలు అని మాత్రమే ఆలోచిస్తోంది. ఆ పార్టీ ఇంకా ఏ రకంగా ప్రిపేర్ కాలేదు అని అంటున్నారు. ఈ రోజుకు చూస్తే బీజేపీకి ఎమ్మెల్యే అభ్యర్ధుల లిస్టే పెద్దగా లేదు అని అంటున్నారు.
వారికి గట్టిగా ఇరవై మంది అభ్యర్ధులకు కూడా సరిపడా గట్టి క్యాడిడేట్స్ లేరు అన్న మాట వినిపిస్తోంది. ఇక బీజేపీ తన బలాన్ని సభల ద్వారా చూపించి ఫోకస్ పెంచి ఇతర పార్టీల నుంచి లాగాలని చూస్తోంది. ఆ విధంగా అధికార పార్టీ టీయారెస్ నుంచి ఎవరైనా వస్తే వారి అర్ధ బలం అంగబలాన్ని ఆధారం చేసుకుని టికెట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది.
తెలంగాణావ్యాప్తంగా చూస్తే 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇందులో ఆరవ వంతుకు కూడా బీజేపీ అభ్యర్ధుల జాబితా రెడీ కాకుండా ముందస్తు ఎన్నికలు అంటే ఆ పార్టీకే ఇబ్బందులో పడుతుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే సొంత బలం మీద ఆధారపడకుండా ఇతర పార్టీలకు గేలం వేసి వారి మీదనే దృష్టి పెడితే అది ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.
ఆయా పార్టీలు వద్దనుకుని అవుట్ డేటెడ్ అయిన వాళ్ళే ఈ వైపుగా వస్తారని, వారికి గ్రౌండ్ లెవెల్ లో పెద్దగా పట్టు ఉండదని, వారిని ముందు ఉంచుకుని ఎన్నికల యుద్ధాన్ని బీజేపీ ఎలా చేయగలదు అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఇలా బీజేపీ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే కేసీయార్ కానీ టీయారెస్ కానీ తెలివిగానే ఆలొచించి మేము ఎపుడైనా ఎన్నికలకు రెడీ, మీ సంగతేంటని గడుసుగానే సవాల్ చేశారు అనుకోవాలి.
ఇక టీయారెస్ వైపు చూసుకున్నా ఇంతకంటే మంచి కాలం కూడా ఉందడని భావిస్తోంది అంటున్నారు. పోటీ ఎంతో కొంత తప్పినా తప్పినట్లే కాబట్టి. బీజేపీ గట్టిగా బలపడకముందే ఎన్నికలలు వెళ్తే టీయారెస్ ఎన్నికలకు వెళ్ళడం బెటర్ అని భావిస్తే మాత్రం కచ్చితంగా ముందస్తు మంత్రాన్ని జంపిస్తే చాన్స్ ఉంది.
మరి ఈ పరిణామాలు తెలంగాణాలొ జెండా పాతేద్దామని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీకి ఏలా కలసివస్తాయన్నది ఆలోచించాల్సిందే అంటున్నారు. మొత్తానికి ఏ వైపు నుంచి చర్చలు చూసినా ముందస్తు ఎన్నికలు తెలంగాణాలో పక్కా అన్న మాటే వినివినిపిస్తోందిట.