ఆమె చేయి టచ్ కోసం తపించాడట

Update: 2016-07-04 19:17 GMT
అత్యంత అమానవీయంగా.. క్రూరంగా గొంతులు కోసి మరీ చంపేసిన ఢాకా ఉగ్రవాదులకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.. ఢాకా ఉగ్రదాడిలో పాల్గొన్న ఒక ఉగ్రవాది.. మన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ వీరాభిమానట. ఒకదశలో.. ఆమెను కలిసి.. ఆమె చేతిని టచ్ చేస్తే చాలనుకునేవాడట. అంతగా ఆమెను అంతలా అభిమానించాడటం ఈ 20 ఏళ్ల రాక్షసుడు.

ఈ రాక్షసుడిని ‘నిబ్రాస్ ఇస్తామ్’గా అధికారులు గుర్తించారు. శ్రద్దాకపూర్ అందంగా ఉంటుందని.. ఆమెను ఒకసారి కలిసి.. ఆమె చేయి పట్టుకుంటే చాలన్న భావనను వ్యక్తం  చేసేవాడట. శ్రద్ధాకపూర్ ఎంత అందంగా ఉంటుందన్న విషయాన్న తన ఫేస్ బుక్ పేజీలో తన పోస్టింగ్ ద్వారా వెల్లడించిన ఈ రాక్షసుడు ఒకదశలో శ్రద్ధాకపూర్ ని ఒక్కసారి అయినా కలిసి టచ్ చేస్తే చాలని అనుకున్నాడట.

శ్రద్ధాకపూర్ చాలా అందంగా ఉంటుందన్న ఉగ్రవాది.. ఆమెను కలుసుకునేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.ఢాకా ఉగ్రదాడిలో 20 మందికి పైగా విదేశీయుల గురించి గుర్తించి మరీ గొంతులు కోసేయటం గమానార్హం. అలాంటి రాక్షసుడికి బాలీవుడ్ భామ అంటే ఎంత ఇష్టమన్న విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం గురించి సదరు బాలీవుడ్ భామకు తెలిస్తే ఎలా  రియాక్ట్ అవుతుందో..?   
Tags:    

Similar News