తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది నిజంగా బ్రేకింగ్ న్యూసే. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా పోలీసు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. దాదాపు 9 నెలలుగా సెర్బియా పోలీసుల నిర్బంధంలోనే ఉన్న నిమ్మగడ్డ... ఎట్టకేలకు రిలీజ్ కాగా... గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో సెర్బియా నుంచి అంతర్జాతీయ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకున్న నిమ్మగడ్డను వైద్యులు క్వారంటైన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో సెర్బియా నిర్బందం నుంచి చాలా కాలం తర్వాత విడుదలైన నిమ్మగడ్డ... కరోనా వైరస్ నేపథ్యంలో మరో 14 రోజుల పాటు క్వారంటైన్ లో కాలం వెళ్లదీయక తప్పదన్న మాట.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రస్ ఆల్ ఖైమా ఏపీలో పెట్టుబడులు పెట్టిన విషయంలో నిమ్మగడ్డ దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని, ఈ కారణంగా రస్ ఆల్ ఖైమా పెట్టుబడులు నిరుపయోగమయ్యాయని, వాటిని తమకు వెనక్కి ఇప్పించాలని అరబ్ దేశాల ద్వారా రస్ ఆల్ ఖైమా భారత ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై అరబ్ కంట్రీస్ తో భారత్ సంప్రదింపులు నెరపుతున్న క్రమంలోనే ఏదో పని మీద నిమ్మగడ్డ సెర్బియా వెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న అరబ్ కంట్రీస్... సెర్బియా ప్రభుత్వంతో మాట్లాడి... నిమ్మగడ్డను అరెస్ట్ చేయించింది. ఈ విషయంపై భారత్ పెద్దగా స్పందించడానికి అవకాశం లేకుండాపోయింది. ఫలితంగా సెర్బియా పోలీసుల అదుపులోనే నిమ్మగడ్డ మగ్గాల్సి వచ్చింది.
ఏమైందో తెలియదు గానీ... నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు విడుదల చేసేందుకు సమ్మతించారు. ఈ క్రమంలో సెర్బియా పోలీసుల నిర్బంధం నుంచి ఉపశమనం లబించిన నిమ్మగడ్డ.. హుటాహుటీన హైదరాబాద్ బయలుదేరారు. అయితే నిమ్మగడ్డ హైదరాబాద్ చేరుకున్న సమయం కరోనాపై హైఅలర్ట్ పరిస్థితులు నెలకొన్నాయి. విదేశాల నుంచి ఎవరు వచ్చినా.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా అటు నుంచి అటే క్వారంటైన్ కు తరలిస్తున్నారు. దీంతో నిమ్మగడ్డ కూడా విదేశాల నుంచే వచ్చిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే నిమ్మగడ్డను నిలిపేసిన వైద్యులు... ఆయనకు వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా ఆయనను క్వారంటైన్ కు తరలించారు.