అమెరికా ‘తానా’ ఎన్నికల్లో నిరంజన్ ప్రభంజనం

Update: 2021-05-30 09:30 GMT
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్యానెల్ ప్రభంజనం సృష్టించింది. తానా అధ్యక్షుడిగా ఆయన విజయం సాధించారు. కర్నూలు జిల్లాకు చెందిన నిరంజన్ అధ్యక్ష బరిలో సునాయసంగా గెలిచారు.

నిరంజన్ తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై 1758 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిరంజన్ కు 10866 ఓట్లు రాగా.. నరేన్ కు 9108 ఓట్లు లభించాయి. తానా ఎన్నికల్లో గెలుపొండంతో నిరంజన్ ప్యానెల్ అమెరికాలో సంబరాలను అంబరాన్నంటించింది.

తానా ఎన్నికల్లో మొత్తం ఓట్లు 33875 ఉండగా.. పోలైన ఓట్లు 21వేలు. ఇక చెల్లని ఓట్లు 2800 ఉన్నాయి. నిరంజన్ ప్యానెల్.. నరేన్ కొడాలి మధ్య తీవ్ర పోటీ జరిగింది. అయితే ‘కొడాలి ఓడాలి’ అంటూ నిరంజన్ అమెరికా అంతటా చేసిన ప్రచారం ఎట్టకేలకు ఫలించింది.

తానాలో సమూల మార్పులు తీసుకువస్తానని ఆయన చేసిన ప్రచారాన్ని అమెరికాలోని తెలుగోళ్లు నమ్మారు. దీంతో ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటిని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.
Tags:    

Similar News