అత్యంత అమానుషంగా వ్యవహరించిన నిర్భయ ఉదంతంలో దోషిగా నిరూపితమైన బాలపిశాచి ఇప్పుడెక్కడ? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. తన స్నేహితులతో కలిసి ఈ పిల్ల పిశాచి నిర్భయ అత్యాచార కాండలో అత్యంత అనాగరికంగా.. పైశాచికంగా వ్యవహరించారు. నిర్బయ అత్యాచార కాండలో జగుప్సాకరంగా వ్యవహరించిన పిల్ల పిశాచి.. మైనర్ కావటం.. మేజర్ కావటానికి కొద్దినెలలే గడువు ఉండటంతో.. అతడ్ని మైనర్ గా గుర్తించి.. జువైనల్ హోంకు తరలించారు.
నిర్భయ కేసులో పరిమిత జైలుశిక్షకు గురైన ఆ పిల్ల పిశాచిని కొద్ది నెలల కిందట విడుదల చేశారు. తాజాగా.. నిర్బయ దోషులకు ఉరి విధించటాన్ని సుప్రీం సమర్థించిన నేపథ్యంలో అతగాడు ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్న తలెత్తుతోంది. నిర్భయ పాశవిక ఉదంతంలో దోషి అయిన ఈ బాల నేరస్తుడు ప్రస్తుతం మైనర్ నుంచి మేజర్ కావటమే కాదు.. ఇప్పుడుఒక ఎన్జీవో నేతృత్వంలో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతగాడికి 23 ఏళ్లుగా చెబుతున్నారు.
జువైనల్ హోం నుంచి విడుదలైన తర్వాత సదరు పిల్ల పిశాచిని ఒక ఎన్జీవో పర్యవేక్షణలో ఉంచారు. గతంలో బస్సు క్లీనర్ గా వ్యవహరించిన అతడు.. ప్రస్తుతం దక్షిణాదిలోని ఒక దాబాలో వంటవాడిగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. అతను పని చేసే దాబా యజమానికి ఈ పిల్ల పిశాచి గురించి తెలీదని తెలుస్తోంది. అయితే.. ఎన్జీవో పర్యవేక్షణలో ఉన్నప్పటికీ నిఘా వర్గాలుమాత్రం ఇతడిపై ఒక కన్నేసి ఉంటాయని చెబుతున్నారు. ఇక.. తాజాగా వెలువడి తీర్పు అతగాడికి చేరే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/